అలా జరిగితే నేనిక ఇంటికి తిరిగి వెళ్లలేను: పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్

Share Icons:

లండన్, 18 జూన్:

వరల్డ్ కప్‌లో భాగంగా గత ఆదివారం భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోవడంతో…పాక్ సీనియర్లతో పాటు అభిమానులు పాక్ జట్టుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

అసలు దేశంలో అడుగు ఎలా పెడతారో చూస్తామంటూ అభిమానులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక మరి ముఖ్యంగా ప్రధాని ఇమ్రాన్ సూచనలను పెడచెవిన పెట్టడం, తప్పుడు నిర్ణయాల కారణంగా కెప్టెన్ సర్ఫరాజ్ ఎక్కువగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

అయితే భారత్ చేతిలో పరాజయం తర్వాత సర్ఫరాజ్ జట్టు సభ్యులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. జట్టులో తానొక్కడికే తిరిగి దేశానికి వచ్చే పరిస్థితులు లేవని, మిగతా అందరికీ ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పినట్లు పాకిస్థాన్ పత్రిక ‘ది న్యూస్’ పేర్కొంది. మిగతా మ్యాచుల్లోనైనా పరిస్థితి మారకుంటే తానిక సొంత దేశంలో అడగుపెట్టలేనని సర్ఫరాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే, అభిమానుల ఆగ్రహాన్ని ప్రతి ఒక్కరు భరించాల్సిందేనన్నాడు.

తాను తిరిగి ఇంటికెళ్తానని అనుకుంటే అది పొరపాటేనని, దురదృష్టవశాత్తు వచ్చే మ్యాచుల్లో మన ప్రదర్శన బాగోలేకపోతే.. తానిక ఇంటికి తిరిగి వెళ్లలేను’’ అని సర్ఫరాజ్ అన్నట్టు పత్రిక పేర్కొంది.

ఇక అయిందేదో అయిపోయిందని, జరగాల్సిన మ్యాచ్‌ల్లోనైనా రాణించి తలెత్తుకోవాలని సహచరులకు సూచించాడు. సర్ఫరాజ్ మాట్లాడుతున్నంతసేపూ సీనియర్ ఆటగాళ్లు షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్‌లు మౌనంగా ఉన్నట్టు పత్రిక తెలిపింది.

 

Leave a Reply