ప్రముఖ చిత్రకళాకారుడు ఇళయరాజా మృతి

Share Icons:

కరోనాతో బాధపడుతున్న ప్రముఖ తమిళ చిత్రకారుడు ఎస్. ఇళయరాజా మొన్న ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఈయన వయసు 43 ఏళ్లు. కుంభకోణం సమీపంలోని సెంబియవరంబిల్‌ అనే గ్రామానికి చెందిన ఇళయరాజా చిత్రకారుడిగా మంచి పేరు గడించారు. కరోనా వ్యాధి సోకడంతో  ఇళయరాజా ఇటీవల చెన్నై, ఎగ్మోర్లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందారు. కోలుకుంటున్నారని అందరూ భావిస్తున్న సమయంలో ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఈయన మృతికి సీఎం స్టాలిన్,  నటుడు దర్శకుడు పార్తిబన్, పా.రంజిత్‌   సంతాపం వ్యక్తం చేశారు.

ప్రసిద్ధి కాంచిన ఇళయరాజా చిత్రాలు కొన్నింటిని తిలకించండి-

 

సేకరణ :- మామాట డస్క్ (అంతర్జాల సంచికల నుండి)

Leave a Reply