హుజురాబాద్ లో  తుఫాన్… కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన కౌశిక్ రెడ్డి!

Share Icons:
  • హుజూరాబాద్ లో టీఆర్ఎస్ నుంచి  పోటీ    
  • ఎంత డబ్బు కావాలో  చూసుకుంటా
  • కౌశిక్ రెడ్డి ఆడియో లీక్

గత ఎన్నికల్లో హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు…..   టీఆర్ యస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ను కలిశారు….

కాంగ్రెస్ పార్టీకి హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి, టీపీసీసీ కార్యదర్శి కౌశిక్ రెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని పార్టీ హైకమాండ్  ఈ అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందిందారు. ఇలాంటి చర్యలను సమర్థించబోమని ఆయన అన్నారు. కౌశిక్ రెడ్డికి ఇప్పటికే తమ పార్టీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసిందని చెప్పారు. కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని అన్నారు.

కౌశిక్ రెడ్డిపై హుజూరాబాద్ టీఆర్ఎస్ నేత కృష్ణమోహన్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కౌశిక్ రెడ్డికి టీఆర్ఎస్ టికెట్ ఎలా వస్తుందని ప్రశ్నించారు.. హుజూరాబాద్ అభ్యర్థి విషయంలో టీఆర్ఎస్ పార్టీ ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

కలకం రేపుతున్న కౌశిక్ రెడ్డి వ్యవహారం ….

మాజీ మంత్రి ఈటల రాజేంద‌ర్ రాజీనామా చేయ‌డంతో ఖాళీ అయిన హుజూరాబాద్ ఎమ్మెల్యే స్థానానికి త్వ‌ర‌లో ఉప‌ ఎన్నిక జ‌ర‌గాల్సి ఉన్న  హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ను అన్ని ప్ర‌ధాన పార్టీలు ప్రతిష్ఠాత్మ‌కంగా తీసుకుంటున్నాయి. ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్నాయి. గతంలో హుజురాబాద్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఈటల చేతిలో కౌశిక్ రెడ్డి ఓడిపోయారు. ఇప్పుడు కౌశిక్‌ రెడ్డిని టీఆర్ఎస్‌ తనవైపునకు తిప్పుకుంటుందంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply