నెల తర్వాత రేవంత్ కనిపించారు

Share Icons:

హైదరాబాద్, డిసెంబర్ 31:

తెలంగాణ‌లో ఎన్నిక‌ల ఫ‌లితాలు అనేక కొత్త సంచ‌ల‌నాల‌ను న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. ఇందులో ఎవ‌రూ ఊహించ‌ని ఫ‌లితాలు రెండు… ఒక‌టి రేవంత్‌రెడ్డి, ఇంకోటి కొండా సురేఖ‌ది. ఆ ఇద్ద‌రూ ఓడిపోవడం తెలంగాణ మొత్తాన్ని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చ‌గా, టీఆర్ఎస్‌ను ఆనందంలో ఓల‌లాడేలా చేసింది. టీఆర్ఎస్ అభిమానుల‌కు రేవంత్ ఓట‌మి ఒక భారీ విజ‌యం లాంటిది. వార‌లా ఫీల‌వ‌డ‌మే రేవంత్ రేంజ్‌. రేవంత్ ఓట‌మికి కాంగ్రెస్ నేత‌లే టీఆర్ఎస్‌కు స‌హ‌క‌రించార‌ని కొన్ని ఆరోప‌ణ‌లు ఉన్నా వాటిలో నిజ‌మెంతో ఎవ‌రికీ తెలియ‌దు. ఇది ప‌క్క‌న పెడితే ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం రేవంత్ రెడ్డి ఒకేసారి మీడియాకు క‌నిపించారు.

మ‌ళ్లీ ఆయ‌న ఎక్క‌డున్నారో, ఏం చేస్తున్నారో ఎవ‌రికీ తెలియ‌దు. ప్ర‌స్తుతం టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న ఆయ‌న ఓడినంత మాత్రాన మీడియాకు దూరంగా ఉండ‌లేరు. కాబ‌ట్టి క‌చ్చితంగా ఆయ‌న త్వ‌ర‌లో క‌నిపిస్తారు. అది ఓకే గాని ఇపుడు ఎక్క‌డికిపోయారు అని చాలా మందికి సందేహం. ఆయ‌న ఎక్క‌డికి పోలేదు. ముంద‌స్తు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి కుటుంబానికి స‌మ‌యం కేటాయించ‌లేక‌పోయిన నేప‌థ్యంలో కుటుంబంతో పాటు విహార యాత్ర‌కు వెళ్లారు. ఓట‌మి జీవితంలో పెద్ద విచిత్ర‌మేమీ కాదు. ఎవ‌రయినా ఎదుర్కోవ‌ల‌సిందే.

పైగా ఈ ఓట‌మి రేవంత్‌కు భ‌విష్య‌త్తులో జాగ్ర‌త్త నేర్పుతుంది కూడా. రాజ‌కీయ నాయ‌కుడు ధృడంగా మారాలంటే ఓట‌మి అవ‌స‌ర‌మే. ఓట‌మిని దిగ‌మింగుకుని ప్ర‌స్తుతం విహార యాత్ర‌లో ఉన్న ఆయ‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న ఓ టైగ‌ర్ రిజ‌ర్వ్ లో విహ‌రిస్తూ ఉన్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తున్నాయి. విహార యాత్ర అనంత‌రం లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు కాంగ్రెస్‌తో పాటు అన్ని పార్టీ స‌మాయ‌త్తం కావ‌ల్సిన అవ‌స‌రం ఉంది. సో మ‌ళ్లీ ఆయ‌న బిజీగా మార‌నున్నారు.

మామాట: ఓడిపోయిన రాజకీయాలు వదల్లేరుగా…

Leave a Reply