TRENDING NOW

19న కోల్‌కతాలో విపక్షాల ర్యాలీ… మాయావతి, కేసీఆర్ డుమ్మా…

19న కోల్‌కతాలో విపక్షాల ర్యాలీ… మాయావతి, కేసీఆర్ డుమ్మా…

కోల్‌కతా, 12 జనవరి:

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు ఈ నెల 19న కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించనున్న సంగతి తెల్సిందే.  కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత స్టాలిన్‌లు ఈ ర్యాలీకి హాజరుకానున్నారు.

అలాగే ఫరూక్ అబ్దుల్లా, తేజస్వీ యాదవ్, శరద్ పవార్, బాబూలాల్ మరాండీ తదితరులు కూడా హాజరుకానున్నారు.

Life Homepathy
treefurn AD

అయితే, బీజేపీ, కాంగ్రెస్ లేని ప్రాంతీయ పార్టీలతో కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్ ఈ ర్యాలీకి హాజరయ్యేందుకు సిద్ధంగా లేరని సమాచారం. అలాగే, మాయావతి, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌లు ర్యాలీకి దూరంగా ఉండే అవకాశాలున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ర్యాలీకి హాజరు కానున్నట్టు సమాచారం.

ఇదిలా ఉంటే అమరావతిలో టీడీపీ నిర్వహించనున్న ధర్మపోరాట సభకు ఈ నేతలందరినీ చంద్రబాబు ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది.

మామాట: కాంగ్రెస్ ఉంటే వీళ్ళు రావడం కష్టమేగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: