మొదలైన రెనో 3 ప్రొ అమ్మకాలు…ధర ఎంతటే?

Share Icons:

ముంబై: చైనా మొబైల్స్ తయారీదారు ఒప్పో తాజాగా రెనో 3 ప్రొ స్మార్ట్ ఫోన్ ఇండియాలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ఫోన్ అమ్మకాలు ఈరోజు నుంచి మొదలయ్యాయి. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లలో ఫోన్ సేల్స్ జరుగుతున్నాయి. ఇక ఒప్పో రెనో 3 ప్రొ స్మార్ట్‌ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.29,990 ఉండగా, 8జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.32,990గా ఉంది.

ఒప్పో రెనో 3 ప్రొ ఫీచర్లు…

6.4 ఇంచుల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే

గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌, 2400 x 1080 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌

ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ హీలియో పి95 ప్రాసెసర్‌, 8జీబీ ర్యామ్‌

128/256 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌

డ్యుయల్‌ సిమ్‌, ఆండ్రాయిడ్‌ 10.0, ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌

64, 8, 13, 2 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు, బ్లూటూత్‌ 5.0

44, 2 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరాలు, డాల్బీ అట్మోస్‌

డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ, యూఎస్‌బీ టైప్‌ సి

4025 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 30 వాట్ల వూక్‌ ఫ్లాష్‌ చార్జ్‌ 4.0

లెనోవో ఇయర్‌బడ్స్‌…

లెనోవో కంపెనీ హెచ్‌టీ10 ప్రొ, హెచ్‌టీ20 పేరిట నూతన ఇయర్‌బడ్స్‌ను హెచ్‌ఈ18 ఇయర్‌ఫోన్స్‌ను, హెచ్‌డీ116 పేరిట నూతన హెడ్‌సెట్‌ను భారత్‌లో తాజాగా విడుదల చేసింది. లెనోవో హెచ్‌ఈ18 ఇయర్‌ఫోన్స్‌ ధర రూ.1199 ఉండగా, ఇవి 12 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తాయి. ఇక లెనోవో హెచ్‌డీ 116 హెడ్‌సెట్‌ 24 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది. ఇది బ్లూటూత్‌ 5.0 ద్వారా కనెక్ట్‌ అవుతుంది. దీన్ని రూ.2499 ధరకు కొనుగోలు చేయవచ్చు.

హెచ్‌టీ10ప్రొ ఇయర్‌బడ్స్‌ 48 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తాయి. ఇవి బ్లూటూత్‌ 5.0 ద్వారా కనెక్ట్‌ అవుతాయి. రూ.4599 ధరకు ఈ ఇయర్‌బడ్స్‌ను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. అలాగే లెనోవో హెచ్‌టీ20 ఇయర్‌బడ్స్‌ రూ.3399 ధరకు లభిస్తున్నాయి. ఇవి 25 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తాయి. వీటికి ఐపీఎక్స్‌5 వాటర్‌ రెసిస్టెన్స్‌ ఫీచర్‌ను అందిస్తున్నారు.

 

Leave a Reply