ఒప్పో రెనో 3ప్రొ వచ్చేసింది….ధర ఎంతటే?

oppo released reno 3 and reno 3 pro 5 g smartphones
Share Icons:

ముంబై: చైనాకు చెందిన మొబైల్స్‌ తయారీదారు ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్‌ రెనో 3 ప్రొను తాజాగా భారత్‌లో విడుదల చేసింది. ఒప్పో రెనో 3 ప్రొ స్మార్ట్‌ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.29,990 ఉండగా, 8జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.32,990గా ఉంది. ఈ ఫోన్‌ను మార్చి 6వ తేదీ నుంచి విక్రయించనున్నారు.

ఇందులో ఉన్న 4025 ఎంఏహెచ్‌ బ్యాటరీకి 30 వాట్ల వూక్‌ ఫ్లాష్‌ చార్జ్‌ 4.0 ఫీచర్‌ను అందిస్తున్నారు. దీని వల్ల ఫోన్‌ను కేవలం 56 నిమిషాల వ్యవధిలోనే 0 నుంచి 100 శాతం చార్జింగ్‌ చేసుకోవచ్చు.

ఒప్పో రెనో 3 ప్రొ ఫీచర్లు…

6.4 ఇంచుల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే

గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌, 2400 x 1080 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌

ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ హీలియో పి95 ప్రాసెసర్‌, 8జీబీ ర్యామ్‌

128/256 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌

డ్యుయల్‌ సిమ్‌, ఆండ్రాయిడ్‌ 10.0, ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌

64, 8, 13, 2 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు, బ్లూటూత్‌ 5.0

44, 2 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరాలు, డాల్బీ అట్మోస్‌

డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ, యూఎస్‌బీ టైప్‌ సి

4025 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 30 వాట్ల వూక్‌ ఫ్లాష్‌ చార్జ్‌ 4.0

హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్‌ ఆర్‌70

మొబైల్స్‌ తయారీదారు హెచ్‌టీసీ తన నూతన స్మార్ట్‌ఫోన్‌ వైల్డ్‌ఫైర్‌ ఆర్‌70 ని భారత్‌లో త్వరలో విడుదల చేయనుంది. ఈ ఫోన్‌ ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.  హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్‌ ఆర్‌70 స్మార్ట్‌ఫోన్‌లో.. 6.53 ఇంచుల డిస్‌ప్లే, 1560 x 720 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌, 2.5 గిగాహెడ్జ్‌ ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ హీలియో పి23 ప్రాసెసర్‌, 2జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌.

ఆండ్రాయిడ్‌ 9.0 పై, హైబ్రిడ్‌ డ్యుయల్‌ సిమ్‌, 16, 2, 2 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు, 8 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్‌ 4.2, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌.. తదితర ఫీచర్లను అందివ్వనున్నారు.

 

Leave a Reply