TRENDING NOW

వావ్…ఒప్పో కొత్త ఫోన్ ఫీచర్లు అదిరాయి….

వావ్…ఒప్పో కొత్త ఫోన్ ఫీచర్లు అదిరాయి….

ఢిల్లీ, 20 జూన్:

సెల్ఫీలకు పెట్టింది పేరైనా ఒప్పో సంస్థ తన నూతన స్మార్ట్‌ఫోన్ ‘ఫైండ్ ఎక్స్’ ను ఈరోజు విడుదల చేసింది. అదిరిపోయే ఫీచర్లతో విడుదల చేసిన ఈ ఫోన్ ధర సుమారు రూ.79,070గా ఉంది. ఆగస్టులో ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. కాగా ఈ నెల 29వ తేదీన భారత్‌లో ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా విడుదల చేయనున్నారు.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.42 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 8 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌లను ఇందులో అమర్చారు. అందువల్ల ఫోన్ వేగంగా పనిచేస్తుంది. అలాగే వెనుక భాగంలో 16, 20 మెగాపిక్సల్ కెమెరాలు రెండింటిని అమర్చగా, ముందు భాగంలో 25 మెగాపిక్సల్ కెమెరా ఉంది. దీనికి ఫ్లాష్ సదుపాయం ఇచ్చారు.

ఒప్పో ఫైండ్ ఎక్స్ ఫీచర్లు…

  • 42 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే
  • 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్
  • 5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్
  • 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్
  • 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • యూఎస్‌బీ టైప్ సి, 4జీ వీవోఎల్‌టీఈ
  • డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ
  • 3730 ఎంఏహెచ్ బ్యాటరీ, వీవోవోసీ ఫ్లాష్ చార్జింగ్, ఫాస్ట్ చార్జింగ్

మామాట: ధర కూడా అదిరిందిగా..

(Visited 70 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: