ఆకర్షణీయమైన ఫీచర్లతో విడుదలైన ఒప్పో కొత్త ఫోన్…

oppo a5 2020 smarphone released in india
Share Icons:

ముంబై: మొబైల్స్‌ తయారీదారు ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్‌ ఎఫ్‌15ను భారత్‌లో తాజాగా విడుదల చేసింది. రూ.19,990 ధరకు ఈ ఫోన్‌ను విక్రయిస్తున్నారు. ఇందులో.. 6.4 ఇంచుల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌, ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ హీలియో పి70 ప్రాసెసర్‌, 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, డ్యుయల్‌ సిమ్‌, ఆండ్రాయిడ్‌ 9.0 పై, 48, 8, 2, 2 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు, 16 మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరా, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్‌ 5.0, యూఎస్‌బీ టైప్‌ సి, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

నో కాస్ట్‌ ఈఎంఐ విధానంలో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్‌ బ్యాంక్‌ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో ఈ ఫోన్‌ కొనుగోలుపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. జనవరి 26వ తేదీ లోపు ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన వారికి వన్‌ టైం స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ ఆఫర్‌ను అందివ్వనున్నారు.

పోర్టబుల్‌ బ్లూటూత్‌ స్పీకర్‌

స్టఫ్‌కూల్‌ కంపెనీ థియో పేరిట ఓ నూతన పోర్టబుల్‌ బ్లూటూత్‌ స్పీకర్‌ను భారత్‌లో తాజాగా విడుదల చేసింది. ఈ స్పీకర్‌ను వినియోగదారులు రూ.1,999 ధరకు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సైట్లతోపాటు స్టఫ్‌కూల్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌లోనూ కొనుగోలు చేయవచ్చు. ఈ స్పీకర్‌ను బ్లూటూత్‌ 5.0, యూఎస్‌బీ, ఆక్స్‌-ఇన్‌లతో ఇతర డివైస్‌లకు కనెక్ట్‌ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న స్పీకర్‌ 5వాట్ల సామర్థ్యం, 40 ఎంఎం డ్రైవర్స్‌ను కలిగి ఉన్నందున సౌండ్‌ అవుట్‌పుట్‌ క్వాలిటీ బాగుంటుంది. మెమొరీ కార్డుకు సపోర్ట్‌, ఎఫ్‌ఎం రేడియో సదుపాయాలను కూడా ఇందులో అందిస్తున్నారు. ఇందులో 1200 ఎంఏహెచ్‌ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. అందువల్ల 6 గంటల పాటు ఈ స్పీకర్‌ బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది.

ఎయిర్‌టెల్‌ కొత్త ఆఫర్

టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ రూ.179కే ఓ నూతన ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను తాజాగా ప్రవేశపెట్టింది. ఇందులో కస్టమర్లకు 2 జీబీ డేటా, 300 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ వస్తాయి. ఈ ప్లాన్‌ వాలిడిటీని 28 రోజులుగా నిర్ణయించారు. దీంతోపాటు కస్టమర్లు ఎయిర్‌టెల్‌ ఎక్స్‌స్ట్రీం యాప్‌ ప్రీమియం, వింక్‌ మ్యూజిక్‌ యాప్‌ సేవలు పొందవచ్చు. అలాగే ఈ ప్లాన్‌తో కస్టమర్లకు రూ.2 లక్షల విలువైన భారతీ ఆక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ బండిల్‌గా లభిస్తుంది.

 

Leave a Reply