బడ్జెట్ ధరలో ఒప్పో ఎ31 (2020)…

oppo a9 smartphone launched in india
Share Icons:

ముంబై: చైనాకు చెందిన మొబైల్స్‌ తయారీదారు ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్‌ ఎ31 (2020) ని ఇండోనేషియా మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. రూ.13,500 ధరకు ఈ ఫోన్‌ వినియోగదారులకు లభిస్తున్నది. త్వరలోనే ఈ ఫోన్‌ను భారత్‌లోనూ విడుదల చేయనున్నట్లు తెలిసింది. ఇందులో 6.5 ఇంచుల డిస్‌ప్లే, మీడియాటెక్‌ హీలియో పి35 ప్రాసెసర్‌, 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 12, 2, 2 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు, 8 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా, బ్లూటూత్‌ 5.0, 4230 ఎంఏహెచ్‌ బ్యాటరీ  తదితర ఫీచర్లను ఏర్పాటు చేశారు.

షియోమీ పవర్‌ బ్యాంక్‌లు

మొబైల్స్‌ తయారీదారు షియోమీ 10000, 20000 ఎంఏహెచ్‌ కెపాసిటీ కలిగిన రెండు నూతన ఫాస్ట్‌ చార్జింగ్‌ రెడ్‌మీ పవర్‌ బ్యాంక్‌లను భారత్‌లో విడుదల చేసింది. కాగా 10000 ఎంఏహెచ్‌ పవర్‌బ్యాంక్‌ ధర రూ.799 ఉండగా, 20000 ఎంఏహెచ్‌ పవర్‌ బ్యాంక్‌ ధర రూ.1499 గా ఉంది. వీటిని ఫిబ్రవరి 18వ తేదీ నుంచి ఎంఐ ఆన్‌లైన్‌ స్టోర్‌, ఎంఐ హోం స్టోర్‌లలో విక్రయించనున్నారు. వీటికి 18 వాట్ల ఫాస్ట్‌ చార్జింగ్‌ ఫీచర్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్లను వేగంగా చార్జింగ్‌ చేసుకోవచ్చు. యూఎస్‌బీ టైప్‌ సి, మైక్రో యూఎస్‌బీ ఫోన్లను ఈ పవర్‌ బ్యాంక్‌లతో చార్జింగ్‌ చేసుకోవచ్చు. చార్జింగ్‌ స్టేటస్‌ కోసం వీటిపై ఎల్‌ఈడీ ఇండికేటర్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక ఎంఐ బ్యాండ్‌, ఎంఐ బ్లూటూత్‌ ఇయర్‌ఫోన్స్‌ను కూడా ఈ పవర్‌ బ్యాంక్‌తో చార్జింగ్‌ చేసుకోవచ్చు.

గెలాక్సీ ఎస్‌10

శాంసంగ్‌ కంపెనీ తన గెలాక్సీ ఎస్‌10 సిరీస్‌ ఫోన్ల ధరలను తగ్గించింది. గెలాక్సీ ఎస్‌20 సిరీస్‌ ఫోన్లను లాంచ్‌ చేసిన నేపథ్యంలో శాంసంగ్‌ ఎస్‌10 ఫోన్ల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో గెలాక్సీ ఎస్‌10ఇ స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర రూ.55,900కు బదులుగా రూ.47,900కు మారింది. అలాగే గెలాక్సీ ఎస్‌10 ధర రూ.16వేల వరకు తగ్గింది. దీంతో ఈ ఫోన్‌ను రూ.54,900 ప్రారంభ ధరకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. అలాగే గెలాక్సీ ఎస్‌10 ప్లస్‌ ధర రూ.17వేల వరకు తగ్గింది. ఇక ఈ ఫోన్‌ను రూ.61,900 ధరకు కొనుగోలు చేయవచ్చు.

 

Leave a Reply