బడ్జెట్ ధరలో విడుదలైన ఒప్పో ఎ5 2020

oppo a5 2020 smarphone released in india
Share Icons:

ముంబై: చైనాకు చెందిన దిగ్గజ మొబైల్స్ తయారీదారు ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎ5 2020ని తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.12,490 ఉండగా, 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.13,990గా ఉంది. ఈ నెల 21వ తేదీ నుంచి ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.

ఒప్పో ఎ5 2020 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు

6.5 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై. 12, 8, 2, 2 మెగాపిక్సల్ క్వాడ్రపుల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా. ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.

అల్కాటెల్ 3టి ట్యాబ్లెట్

మొబైల్స్ తయారీదారు అల్కాటెల్.. 3టి 10 పేరిట ఓ నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. 2 జీబీ ర్యామ్ కెపాసిటీ గల ఈ ట్యాబ్లెట్ రూ.9,999 ధరకు వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో లభిస్తున్నది. కాగా ఈ ట్యాబ్‌తోపాటు ఎక్స్‌టర్నల్ డాక్ స్పీకర్లు, 2000 ఎంఏహెచ్ బ్యాటరీని అదనంగా కొనుగోలు చేస్తే రూ.14,999 అవుతుంది.

అల్కాటెల్ 3టి 10 ట్యాబ్లెట్‌లో.. 10 ఇంచుల డిస్‌ప్లే, 1.28 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, సింగిల్ సిమ్, 2, 2 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4080 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

ఐఫోన్ల ధరలని తగ్గించిన యాపిల్…

తాజాగా యాపిల్ సంస్థ ఐఫోన్ 11 సిరీస్ మీద మూడు కొత్త స్మార్ట్ ఫోన్లని విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కొత్త ఫోన్లు విడుదల సందర్భంగా యాపిల్ సంస్థ పాత ఫోన్ల ధరలని తగ్గించింది.

ఐఫోన్ Xఆర్ 64జీబీ – పాత ధర రూ.76,900 – కొత్త ధర రూ.49,900 – తగ్గింపు రూ.27వేలు

ఐఫోన్ Xఆర్ 128జీబీ – పాత ధర రూ.81,900 – కొత్త ధర రూ.54,900 – తగ్గింపు రూ.27వేలు

ఐఫోన్ 8 ప్లస్ 64జీబీ – పాత ధర రూ.69,900 – కొత్త ధర రూ.49,900 – తగ్గింపు రూ.20వేలు

ఐఫోన్ 8 64జీబీ – పాత ధర రూ.59,900 – కొత్త ధర రూ.39,900 – తగ్గింపు రూ.20వేలు

ఐఫోన్ 7 32జీబీ – పాత ధర రూ.39,900 – కొత్త ధర రూ.29,900 – తగ్గింపు రూ.10వేలు

ఐఫోన్ 7 128జీబీ – పాత ధర రూ.49,900 – కొత్త ధర రూ.34,900 – తగ్గింపు రూ.15వేలు

ఐఫోన్ 7 ప్లస్ 32జీబీ – పాత ధర రూ.49,900 – కొత్త ధర రూ.37,900 – తగ్గింపు రూ.12వేలు

ఐఫోన్ 7 ప్లస్ 128జీబీ – పాత ధర రూ.59,900 – కొత్త ధర రూ.42,900 – తగ్గింపు రూ.17వేలు

Leave a Reply