ఆకర్షణీయమైన ఫీచర్లతో వన్‌ప్లస్ 7టి ప్రొ మెక్‌లారెన్ ఎడిషన్‌

oneplus 7t pro mclaren edition released
Share Icons:

ముంబై: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీదారు వన్‌ప్లస్ ఇటీవలే వన్‌ప్లస్ 7టి ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ఫోన్‌కు గాను మెక్‌లారెన్ ఎడిషన్‌ను ఆ కంపెనీ ప్రస్తుతం విడుదల చేసింది. ఈ వేరియెంట్ ధర రూ.58,999 ఉండగా దీన్ని నవంబర్ 5వ తేదీ నుంచి విక్రయించనున్నారు. వన్‌ప్లస్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లలో ఇప్పటికే ఈ ఫోన్‌కు గాను ప్రీ ఆర్డర్లను ప్రారంభించారు. వినియోగదారులు రూ.5వేలు చెల్లించి ఈ ఫోన్‌ను ప్రీ ఆర్డర్ చేయవచ్చు.

వన్‌ప్లస్ 7టి ప్రొ మెక్‌లారెన్ ఎడిషన్ ఫీచర్లు…

6.67 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10, డ్యుయల్ సిమ్, 48, 8, 16 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు. 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4080 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

అలాగే వన్‌ప్లస్ 7టి ప్రొకు సంబంధించిన విక్రయాలని తాజాగా మొదలుపెట్టారు. ఈ ఫోన్ రూ.53,999 ధరకు వినియోగదారులకు లభిస్తున్నది. దీని కొనుగోలుపై పలు ఆఫర్లను కూడా అందిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో రూ.3వేలు, ఐసీఐసీఐ కార్డులతో రూ.1750 వరకు ఈ ఫోన్‌పై డిస్కౌంట్‌ను పొందవచ్చు. నో కాస్ట్ ఈఎంఐ పద్ధతిలో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ కొనుగోలుపై ఎయిర్‌టెల్ వినియోగదారులు 3 నెలల పాటు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్, ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌లను ఉచితంగా పొందవచ్చు.

వన్‌ప్లస్ 7టి ప్రొ ఫోన్‌ ఫీచర్లు…

6.67 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10, డ్యుయల్ సిమ్, 48, 8, 16 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు.

16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 5.0, 4080 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Leave a Reply