త్వరలో విడుదల కానున్న వన్‌ప్లస్ 7టి, గూగుల్ పిక్సల్ స్మార్ట్‌ఫోన్లు

one plus 7t and google pixel smartphones release soon
Share Icons:

ముంబై: ఆకర్షణీయమైన ఫీచర్లని అందించే చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు వన్‌ప్లస్ తన నూతన స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 7టిని ఈ నెల 26వ తేదీన విడుదల చేయనుంది. వన్‌ప్లస్ 7టి ఫోన్‌లో 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అలాగే ఇందులో 6.55 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, 48, 16, 12 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా తదితర ఫీచర్లను ఏర్పాటు చేసినట్లు తెలిసింది.

గూగుల్ పిక్సల్ ఫోన్లు..

సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్.. పిక్సల్ సిరీస్‌లో నూతన స్మార్ట్‌ఫోన్లను అక్టోబర్ 15వ తేదీన విడుదల చేయనుంది. పిక్సల్ 4, పిక్సల్ 4 ఎక్స్‌ఎల్ ఫోన్లతోపాటు పిక్సల్‌బుక్ 2ను కూడా గూగుల్ విడుదల చేయనుంది. పిక్సల్ 4 ఫోన్లలో స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, వెనుక భాగంలో 12.2, 12.2, 16 మెగాపిక్సల్ కెమెరాలు మూడు, ముందు భాగంలో 20 మెగాపిక్సల్ కెమెరా, 5.7/6.23 ఇంచుల డిస్‌ప్లే, 64/128 జీబీ స్టోరేజ్ తదితర ఫీచర్లను అందివ్వనున్నట్లు తెలిసింది.

షియోమీ కొత్త టీవీ

చైనా మొబైల్స్ తయారీదారు షియోమీ..భారత్‌లో తాజాగా పలు ఎంఐ టీవీ మోడల్స్‌ను విడుదల చేసింది. 40, 43, 50, 65 ఇంచుల డిస్‌ప్లే సైజుల్లో ఈ టీవీలు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ నెల 29వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లలో ఈ టీవీలను విక్రయించనున్నారు. 40 ఇంచుల టీవీ ధర రూ.17,999 ఉండగా ఇందులో ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్‌ను మాత్రమే అందిస్తున్నారు. ఇక మిగిలిన మూడు టీవీల్లోనూ 4కె అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్‌ను అందిస్తున్నారు. వాటి ధరలు రూ.24,999 (43 ఇంచులు), రూ.29,999 (50 ఇంచులు), రూ.55,999 (65 ఇంచులు)గా ఉన్నాయి.

షియోమీ.. ఎంఐ స్మార్ట్‌బ్యాండ్

అలాగే షియోమీ ఎంఐ స్మార్ట్‌బ్యాండ్ 4 పేరిట స్మార్ట్‌బ్యాండ్ సిరీస్‌లో నూతన బ్యాండ్‌ను తాజాగా భారత్‌లో విడుదల చేసింది. ఈ బ్యాండ్‌లో 0.95 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి స్క్రాచ్ రెసిస్టెంట్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. హార్ట్‌రేట్, యాక్టివిటీస్, వెదర్ నోటిఫికేషన్లు, యాప్స్, కాల్స్, మ్యూజిక్ కంట్రోల్స్, స్లీప్ ట్రాకర్, సెడెంటరీ రిమైండర్, వాటర్ రెసిస్టెన్స్, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, 135 ఎంఏహెచ్ బ్యాటరీ, 20 రోజుల బ్యాటరీ బ్యాకప్ తదితర ఫీచర్లను ఈ బ్యాండ్‌లో అందిస్తున్నారు. ఇది రూ.2299 ధరకు వినియోగదారులు లభించనుంది.

 

Leave a Reply