ఒకే దేశం…ఒకే రేషన్ కార్డు: మోడీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం…

one-nation-one-ration-card-inside-food-ministrys-ambitious-scheme-to-make-ration-cards-portable
Share Icons:

ఢిల్లీ: ఒకే దేశం-ఒకే పన్ను అంటూ దేశమంతా ఒకే ట్యాక్స్ విధానాన్ని తీసుకొచ్చిన మోడీ ప్రభుత్వం…మరో సరికొత్త నిర్ణయంతో ముందుకొచ్చేసింది. ఇక నుంచి దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునేలా ఒకే దేశం-ఒకే రేషన్ కార్డు పేరుతో సరికొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఈ నిర్ణయం వల్ల ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లోని వారు తెలంగాణలో, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు ఏపీలో కూడా రేషన్ తీసుకోవచ్చు. ఈ మేరకు రేషన్ కార్డు పోర్టబులిటీని (ఎక్కడైనా రేషన్ తీసుకునేలా) ప్రారంభించేందుకు దేశమంతా అన్ని రేషన్ షాపుల్లో ePoS యంత్రాలను ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నామని ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ తెలిపింది. లబ్ధిదారులకు అప్పటికే రేషన్ కార్డు ఉండి ఉంటే.. వారు మరో ప్రాంతానికి లేదా మరో రాష్ట్రానికి తరలి వెళ్లినప్పుడు కొత్త రేషన్ కార్డు తీసుకోకుండా దాని పైనే రేషన్ ఇస్తారు. ఇదే రేషన్ కార్డు పోర్టబులిటీ ముఖ్య ఉద్దేశ్యం.

ముఖ్యంగా ఈ విధానం వేరే రాష్ట్రాలకు వలస వెళ్ళి పనులు చేసుకుంటున్న కార్మికులు, కూలీలు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వారికి ఉపయోగపడనుంది. వీరు తమ రాష్ట్రాలు జారీ చేసిన రేషన్ కార్డు ఆధారంగా ఏ రాష్ట్రంలో అయినా బయోమెట్రిక్ ప్రామాణికం ద్వారా తమ కుటుంబం కోసం రేషన్ సరుకులు తీసుకోవచ్చు

ఇక ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ పీడీఎస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్, త్రిపుర తదితర రాష్ట్రాల్లో ఉంది. ఈ రాష్ట్రాల ప్రజలు ఆ రాష్ట్రంలోని ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకునే వెసులుబాటు ఉంది. ఇప్పుడు కేంద్రం సంస్కరణ ద్వారా ఏ రాష్ట్రంలోనైనా తీసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం అన్ని రేషన్ కార్డుల సెంట్రల్ రిపోజిటరీని ఏర్పాటు చేస్తోంది. లబ్ధిదారులందరినీ జాతీయస్థాయిలో డీ-డూప్లికేషన్ చేసిన తర్వాత డేటా అప్ లోడ్ చేస్తారు. డీ-డూప్లికేషన్ తర్వాత సెంట్రల్ రిపోజిటరీలో పేర్లు ఉన్న లబ్ధిదారులకు మాత్రమే రేషన్ కార్డు పోర్టబులిటీ ఉంటుంది.

ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు విధానాన్ని ప్రయోగాత్మకంగా ఇటీవల అమలులోకి తెచ్చారు. ఇందులో భాగంగా తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, గుజరాత్‌కు చెందిన రెండు క్లస్టర్లుగా రేషన్ పంపిణీ ప్రారంభమైంది. ఇది విజయవంతంగా అమలవుతుంది.

 

Leave a Reply