ఫలితాలకి ముందే ఆ మంత్రి చేతులెత్తేశారా..

Share Icons:

అమరావతి, 16 మే:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాబోతుందని ఎక్కువ చర్చ నడుస్తున్న విషయం తెల్సిందే. అయితే ఇప్పటికే వెలువడిన చాలా సర్వేలలో ఈ విషయం తేటతెల్లమైంది.

అయితే కొన్ని సర్వేలు మాత్రం టీడీపీదే విజయం అని చెబుతున్నాయి. ఇక ఈ సర్వేలను, పోలింగ్ సరళిని ఆధారంగా చేసుకుని ఆయా పార్టీల అభ్యర్థులు తమతమ గెలుపుపై అంచనాలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ సారి నెల్లూర్ సిటీలో టీడీపీ-వైసీపీలా మధ్య  హోరాహోరీగా పోరు సాగిందనే చెప్పాలి.

ఇక్కడ వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ బరిలో ఉండగా, టీడీపీ నుంచి మంత్రి నారాయణ పోటీలో నిలిచారు. అయితే మంత్రి నారాయణకు పేరు, ఆర్థికంగా సంపన్నుడు కావడంతో  ఆయన గెలుపు ఖాయమని అందరూ భావించారు.

కానీ ఎన్నికల ముగిశాక ఆ ధీమా ఆయన లో లేదు. ఎన్నికల సమయంలో డబ్బు పంపీణీలో తమ పార్టీ నేతలు మోసం చేసారని ఆయన పార్టీ పెద్దల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. దీనికి తోడు తాజాగా అమరావతిలో నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. తన ప్రత్యర్ధి బలమైనవాడని, ఆయన నాకంటే ఎక్కువగా ప్రజల్లో ఉంటాడని అయినా నేను చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఆయనపై పోటీకీ నిలబడానని అన్నారు.

మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలని బట్టి చూస్తే అనిల్ ఎంత బలమైన నేతో అర్ధమవుతుంది. మొత్తం మీద మంత్రి ఎన్నికల ముందే చేతులెత్తేసారని చెప్పాలి.

మామాట: ఏం తెలియన్నా ఫలితాల వరకు చూడాల్సిందే

Leave a Reply