పాతబస్తీలో చిన్నారిపై ఆత్యాచారం

a minor girl gang raped in chennai
Share Icons:

హైదరాబాద్, జనవరి 22: 

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఏడేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు నెల రోజుల నుంచి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. వివరాలు ఇలా వున్నాయి. పాతబస్తీలోని జంగమ్మెట్కు చెందిన మతీన్ అలీఖాన్‌కు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ క్రమంలో విభేదాలు రావడంతో ఏడాదికే భార్య అతడిని వదిలేసి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న అలీఖాన్ కన్ను పక్కింటిలోని ఓ ఏడేళ్ల చిన్నారిపై పడింది.

sri-srinivasa-plywood-amp-hardware

బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెను మరో ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఇటీవలే జరిగిన దాన్ని బాలిక పిన్ని చూసింది. ఆమె  రాకను పసిగట్టిన అలీఖాన్ అక్కడి నుంచి పారిపోయాడు. నెల రోజుల నుంచి ఇలా చేస్తున్నాడని చిన్నారి తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందు భయపడ్డారు. తరువాత తేరుకుని పోలీసులకు పిర్యాదు చేసారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.

మామాట: ఇలాంటి దుర్మార్గులకు ఎలాంటి శిక్ష విధించాలో

Leave a Reply