కోరిక తీర్చలేదని బాలుడిని ఓ యువతి ఏం చేసిందంటే…?

One lady rape attempt on one young boy
Share Icons:

గ్రేటర్ నోయిడా, 10 అక్టోబర్:

తన కోరిక తీర్చలేదని ఓ యువతి బాలుడిపై దారుణానికి పాల్పడింది. లైంగిక వాంఛని తీర్చమని అడిగితే ఒప్పుకోలేదని ఆ బాలుడి జననాంగాలను పట్టకారతో కత్తిరించింది. ఈ దారుణ ఘటన న్యూఢిల్లీ శివార్లలోని గ్రేటర్ నోయిడాలో చోటు చేసుకుంది.

ఈ ఘటనకి సంబంధించిన వివరాల్లోకి వెళితే…. బదాల్‌పూర్‌ పరిధిలోని చప్రౌలా గ్రామంలో గత శుక్రవారం నాడు, పొరుగింట్లో ఉంటున్న 13 ఏళ్ల బాలుడిని వివాహిత అయిన యువతి తన ఇంటికి పిలిపించుకుంది. అయితే ఏదో పని ఉందనుకుని ఇంటికొచ్చిన బాలుడిని తన కోరికను తీర్చాలని బలవంత పెట్టింది. కానీ అందుకు అతను నిరాకరించాడు. దీంతో ఆగ్రహానికి గురయిన ఆ యువతి అతని జననాంగాన్ని కత్తిరించింది.

ఇక తీవ్ర గాయాలపాలైన బాలుడు, తల్లికి విషయాన్ని చెప్పాడు. దీంతో నిందితురాలిపై ఐపీసీలోని సెక్షన్ 323, 324, 342, 363, 506 సెక్షన్ల కింద కేసు పెట్టామని, విచారిస్తున్నామని తెలిపారు.

మామాట: నిజంగా ఇది దారుణమైన సంఘటనే…

Leave a Reply