పవన్ లాంగ్ మార్చ్‌కు రానంటున్న రాపాక…

police case against janasena mla
Share Icons:

అమరావతి: గత కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వంతో స్నేహంగా ఉంటూ…జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లకు వరుస షాకులు ఇస్తున్న ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి పవన్ కు గట్టి షాక్ ఇచ్చారు. వచ్చే నెల 2న బీజేపీతో కలిసి చేయనున్న లాంగ్ మార్చ్‌కు హాజరు కానేమో అని రాపాక చెబుతున్నట్లు తెలిసింది. లాంగ్‌మార్చ్ పేరుతో వచ్చేనెల 2వ తేదీన ఈ ప్రదర్శనను బీజేపీ, జనసేన సంయుక్తంగా సారథ్యాన్ని వహించబోతున్నాయి. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి నుంచి విజయవాడ వరకూ కొనసాగుతుందీ లాంగ్‌మార్చ్. అమరావతి ప్రాంత రైతులకు అండగా ఉండటానికి, రాజధానిగా అమరావతినే కొనసాగించడానికీ ఉద్దేశించిన లాంగ్ మార్చ్.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన తరువాత దీన్ని నిర్వహించాలని నిర్ణయించుకోవడం వల్ల.. తన సత్తా ఏమిటో చాటాలని జనసేన భావిస్తోంది. ఇంత ప్రాధాన్యత ఉన్న లాంగ్‌మార్చ్‌కు దూరంగా ఉండాలని రాపాక వరప్రసాద్ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. పార్టీ అగ్ర నాయకత్వం తీసుకునే నిర్ణయాలకు ముందు నుంచీ తాను ఎలా దూరాన్ని పాటిస్తూ వస్తున్నారో.. అదే వైఖరిని ఇక్కడా ప్రదర్శించాలని రాపాక భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సారి జనసేన పార్టీలో రాజకీయ పరిస్థితులు, వాతావరణం భిన్నంగా కనిపిస్తున్నాయని, బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల, అది ఇష్టం లేకపోవడం వల్లే ఈ సారి నిర్వహించబోయే లాంగ్‌మార్చ్‌కు దూరంగా ఉండాలని ఆయన ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే పవన్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. దత్త పుత్రుడు తన అజ్ఞానాన్ని పదేపదే బయట పెట్టుకుంటున్నాడు. రాజధాని మారిస్తే ప్రభుత్వాన్ని కూలుస్తానని ప్రగల్భాలు పలికిన వెంటనే బిజెపి పెద్దలు క్లాస్ పీకినట్టున్నారు. తెలివిలోకి వచ్చి రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని ఒప్పుకున్నాడు. యూ-టర్నుల్లో యజమానిని మించి పోయాడు’ అని పవన్ కళ్యాణ్ పై తీవ్రంగా విమర్శించారు. అభివృద్ధి వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల అభివృద్ధి బిల్లు 2020ని సెలెక్ట్ కమిటీకి పంపడమనేది చంద్రబాబు చేసిన కుట్రేనని విజయసాయి రెడ్డి ధ్వజమత్తారు.

 

Leave a Reply