కర్ణాటకలో దారుణం: విద్యార్ధినిపై గ్యాంగ్ రేప్…వీడియో తీసి బెదిరింపులు…

Old video of gangrape of college student goes viral, Karnataka cops arrest 5
Share Icons:

బెంగళూరు:

 

కర్ణాటకలో దారుణమైన సంఘటన జరిగింది. ఓ కాలేజీ విద్యార్ధినిపై ఐదుగురు కుర్రాళ్ళు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఇక ఆ దృశ్యాలని వీడియో తీసి ఎవరికైనా చెప్పేస్తామని బెదిరించారు. చివరికి వీడియోకి సంబంధించిన కొన్ని దృశ్యాలు బయటకి రావడంతో పోలీసులు విచారణ చేసి ఐదుగురు దుండగులని అరెస్ట్ చేశారు.

 

ఈ ఘటన దక్షిణ కన్నడ జిల్లాలో జరిగింది. బాధితురాలు చదివే కాలేజీలోనే చదువుతున్న మరో కుర్రాడు… రోజూ ఆమె ఒంటరిగా వెళ్ళడం గమనించి కాలేజీలోని మరో నలుగురు కుర్రాళ్లకు ఈ విషయం చెప్పాడు.

 

ఈ క్రమంలోనే బాధితురాలు… రోజూ లాగే…ఏప్రిల్ 3వ తేదీన బస్సు దిగి ఇంటికి వెళ్తోంది. ఆమెను వెంటాడిన ఐదుగురూ… నోరు నొక్కి బలవంతంగా చెట్లలోకి లాక్కుపోయారు. ఒకరి తర్వాత ఒకరుగా గ్యాంగ్ రేప్ చేశారు. ఇదంతా ఓ కుర్రాడు వీడియో తీశాడు. ఎవరికైనా చెబితే… వీడియోని ఇంటర్నెట్‌లో పెడతామని భయపెట్టారు. దాంతో ఆమె సైలెంట్ గా ఉండిపోయింది.

 

అయితే కొన్ని రోజుల తర్వాత ఒకడు… ఆ వీడియోలో చిన్న పార్టుని వాట్సాప్‌లో షేర్ చేశాడు. అది కాస్తా వైరల్ అవ్వడంతో విషయం పోలీసులకు తెలిసింది. సుమోటోగా కేసు నమోదుచేసి… వాట్సాప్ అధారంగా ఆ కాలేజీ కుర్రాణ్ని పట్టుకున్నారు. వాడిని విచారించిన పోలీసులు బాధితురాలి ద్వారా కంప్లైంట్ నమోదు చేసుకుని….గ్యాంగ్‌రేప్‌ చేసిన మిగతా నలుగురిని కూడా అరెస్టు చేశారు.

Leave a Reply