ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ఆరంభం!

Share Icons:
  • 50 శాతం ఛార్జ్ చేస్తే 75 కిలోమీటర్లు
  • పూర్తిగా చార్జి చేస్తే 150 కిలోమీటర్లు
  • ఈ-స్కూటర్ “సెగ్మెంట్-బెస్ట్” ఫీచర్లతో
  • కీ సహాయం లేకుండానే యాప్ ద్వారా స్టార్ట్ 

ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు ఓలా ఎలక్ట్రిక్ శుభవార్తను తెలిపింది. ఇప్పుడు ఓలా స్కూటర్ బుకింగ్స్ మొదలయ్యాయి. కంపెనీ చీఫ్ భవిష్ అగర్వాల్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ ప్రకటన చేశారు. ఆ ట్వీట్ లో ఆయన ఇలా పేర్కొన్నారు.. “భారతదేశంలో ఈ రోజు ఈవీ విప్లవం ప్రారంభమైంది! ఓలా స్కూటర్ కొరకు బుకింగ్స్ ఓపెన్ చేశాము! ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో ప్రపంచ నాయకుడిగా భారతదేశం ఎదగగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనికి నాయకత్వం వహించడం మాకు గర్వంగా ఉంది! #JoinTheRevolution http://olaelectric.com @olaelectric” అని పోస్టు చేశారు.

ఆసక్తి గల ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులు ఈ స్కూటర్ ను ₹499 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు పోస్టులోలో అగర్వాల్ ఈ కొత్త స్కూటర్ కొన్ని కొత్త ఫీచర్లను కూడా ధృవీకరించారు. కొత్త ఈ-స్కూటర్ “సెగ్మెంట్-బెస్ట్” ఫీచర్లతో వస్తుంది. ఓలా స్కూటర్ లో బెస్ట్ ఇన్ క్లాస్ బూట్ స్పేస్ కూడా ఉంది. కీ సహాయం లేకుండానే యాప్ ద్వారా దీనిని స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎర్గోనమిక్ సీటింగ్ తో వస్తుందని ఓలా పేర్కొంది. టీజర్ వీడియోలో కంపెనీ “మెరుగైన కార్నరింగ్” సామర్థ్యంతో పాటు “క్లాస్-లీడింగ్ యాక్సిలరేషన్” కూడా లభిస్తుందని పేర్కొంది.

డిజైన్ పరంగా, ఈ స్కూటర్ స్లిమ్ ప్రొఫైల్ కలిగి ఉంది. అయితే, ఎల్ఈడీడీఆర్ఎల్ చుట్టూ ఉన్న ట్విన్ హెడ్ ల్యాంప్ క్లస్టర్ దీనికి ప్రత్యేకమైన రూపాన్ని అందిస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ డ్రైవింగ్ రేంజ్ అధికారిక గణాంకాలను వెల్లడించలేదు. అయితే, 50 శాతం ఛార్జ్ చేస్తే 75 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చు అని కంపెనీ పేర్కొంది. స్కూటర్ సుమారుగా ఒకసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు మనం సురక్షితంగా ప్రయాణించవచ్చు.

సేకరణ :-  మామాట డస్క్ (అంతర్జాల సంచికల నుండి)

 

Leave a Reply