ఓలా క్రెడిట్ కార్డులు వచ్చేశాయ్…

Share Icons:

ముంబై, 18 మే:

ప్ర‌ముఖ క్యాబ్ సంస్థ  ఓలా.. ఎస్‌బీఐ బ్యాంక్‌తో క‌ల‌సి ఓలా మ‌నీ ఎస్‌బీఐ పేరిట ఓ నూత‌న క్రెడిట్ కార్డును విడుద‌ల చేసింది. ఇక ఈ కార్డును పొందేందుకు క‌స్ట‌మ‌ర్లు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన ప‌నిలేదు. అయితే ఈ కార్డుకు 2వ ఏడాది నుంచి రూ.499 వార్షిక ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏడాదిలో ల‌క్ష రూపాయాల‌కు పైగా ఈ కార్డుతో ఖ‌ర్చు చేస్తే ఎలాంటి వార్షిక రుసుం చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు..!

ఈ కార్డుతో ప్రొడ‌క్ట్స్‌ను కొనుగోలు చేస్తే 20 శాతం వ‌ర‌కు క్యాష్‌బ్యాక్ ఇస్తారు. ఓలా క్యాబ్‌ల‌లో వెళ్లిన‌ప్పుడు ఓలా మనీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేస్తే 7 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తారు.
అలాగే దీంతో క్లియ‌ర్‌ట్రిప్‌లో హోట‌ల్ రూమ్స్‌ను బుక్ చేసుకుంటే 20 శాతం వ‌ర‌కు, రెస్టారెంట్ బిల్స్‌పై 20 శాతం వ‌ర‌కు క్యాష్ బ్యాక్ ఇస్తారు.

కార్డును పొందిన వారికి ఎర్లీ బ‌ర్డ్ ఆఫ‌ర్ కింద రూ.500 ఓలా మ‌నీ, రూ.300 విలువైన క్లియ‌ర్ ట్రిప్ వోచ‌ర్‌, 3 నెల‌ల కాల‌వ్య‌వ‌ధి గ‌ల ఉచిత డైన‌వుట్ గార్మెట్ పాస్‌పోర్ట్ మెంబ‌ర్‌షిప్ ల‌భిస్తాయి.

మామాట: ఏదైనా వినియోగదారులని ఆకర్షించడమే

Leave a Reply