ఒకినావా స్కూటర్స్‌పై 26 వేల వరకు తగ్గింపు…

Share Icons:

ముంబై, 7 మే:

ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని తన ఎలక్ట్రిక్ స్కూటర్ల యజమానులకు అందజేస్తామని ఒకినావా స్కూటర్స్ ప్రకటించింది. ఫేమ్ II పథకం కింద సబ్సిడీ పొందిన తొలి కంపెనీ ఇదే కావడం గమనార్హం. ఒకినావా ఐ ప్రేజ్ ధర రూ. 1.16లక్షలు(ఎక్స్ షోరూం(ఇండియా))గా ఉంది. అలాగే ఒకినావా రిడ్జ్+ స్కూటర్ ధర రూ. 79,290(ఎక్స్ షోరూం, ఇండియా).

ఒకినావా రిడ్జ్+, ఐ ప్రేజ్‌లపై కేడబ్ల్యూహెచ్ ఆధారంగా రూ. 17,000 – రూ. 26,000 వరకు ధర తగ్గనుంది. కాగా, ఒకినావా రిడ్జ్+ 1200వాట్ బ్రష్‌లెస్ డీసీ మోటర్ కలిగివుంది. 1.75కెడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ. ఈ స్కూటర్ ను ఫుల్ ఛార్జ్ చేస్తే 90 నుంచి 100 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. ఫ్రంట్, రేర్ లో కూడా డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి.

అలాగే ఒకినావా ఐ-ప్రేజ్ అనేది ప్రీమియం స్కూటర్, ఇది 2,500వాట్ బ్రష్‌లెస్ డీసీ మోటార్ ఉంటుంది. స్కూటర్‌ను ఫుల్ ఛార్జ్ చేస్తే 160-180 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది. 2.9కేడబ్ల్యూ‌హెచ్ లిథియం ఐయాన్ బ్యాటరీ కలిగివుంది. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కావడానికి సుమారు 3గంటలు పడుతుంది. ఈ స్కూటర్ రీజనరేటివ్ బ్రేకింగ్ కలిగివుంది. ఫ్రంట్, రేర్ డిస్క్ బ్రేక్స్ కలిగివుంది. 

మామాట: స్కూటర్ల అమ్మకాలు పెరగాలంటే ఆ మాత్రం తగ్గింపు ఉండాల్సిందే

Leave a Reply