ఒడిశా రసగుల్లాకు భౌగోళిక గుర్తింపు ఇచ్చిన జీఐ రిజిస్ట్రార్‌

Odisha rasagola gets GI tag
Share Icons:

భువనేశ్వర్:

 

రసగుల్లా…ఈ పేరు చెప్పగానే అందరికీ ఠక్కున నోరూరుతుంది. అయితే ఈ రసగుల్లాని మనదేశంలో అన్ని చోట్ల లభ్యమవుతుంది కానీ…దీనికి ఒడిశా రాష్ట్రానిదే ప్రత్యేకత ఉంది. అక్కడ రసగుల్లా రుచికి మంచి స్థానం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఒడిశా రాష్ట్రంలో తయారయ్యే రసగుల్లాలకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఇక్కడి రసగుల్లాలకు భౌగోళిక గుర్తింపు (జియాగ్రాఫికల్ ఇండికేషన్) జీఐ ట్యాగ్‌ను జారీ చేస్తూ భారత జీఐ రిజిస్ట్రార్ ఆదేశాలు జారీచేశారు.

 

అయితే ఒక్కో ప్రాంతంలో తయారయ్యే లేదా ఉత్పత్తి అయ్యే కొన్ని రకాల వస్తువులకు సహజంగా ఒక నాణ్యత ఉంటుంది. అదేవాటి ప్రత్యేకత. ఆ విశిష్టతను దృష్టిలో ఉంచుకొని జీఐ ట్యాగ్ జారీ చేస్తారు. దీనివల్ల ఆయా వస్తువులు పంటలు లేదా కళల పేరుతో మరొకరు మరో ప్రాంతంలో వాటిని రూపొందించి విక్రయించడం చట్టారిత్యా చెల్లదు.

 

బాస్మతి బియ్యం, డార్జిలింగ్ టీపొడి, పొచంపల్లి చీరలు, బొబ్బిలి వీణ, గద్వాల్ చీర, కొండపల్లి, నిర్మల్ బొమ్మలు , తిరుపతి లడ్డూ బంగినపల్లి మామిడిపళ్లు సహా పలు ఉత్పత్తలుకు ప్రస్తుతం భౌగోళిక గుర్తింపు ఉంది.

 

 

Leave a Reply