బాబుకి ఒడిశా సీఎం షాక్…

Share Icons:

భువనేశ్వర్, 9 జనవరి:

కేంద్రంలోని ప్రధాని మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా ఏపీ సీఎం చంద్రబాబు దేశంలోని ప్రతిపక్ష పార్టీలని ఏకతాటి పైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు నేతలని కలుసుకున్న చంద్రబాబు…కాంగ్రెస్ సారథ్యంలో మహాకూటమి ఏర్పాటుకు పావులు కదుపుతున్నారు.

ఈ నేపథ్యంలోనే బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటవుతున్న ఈ మహాకూటమిలో తాము చేరడం లేదని బిజూ జనతాదళ్ (బీజేడీ) అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. ఇక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఇప్పటి వరకు తాము దూరంగానే ఉంటూ వస్తున్నామని… ఇకపై కూడా తాము ఇదే విధానాన్ని కొనసాగిస్తామని చెప్పారు.

కాగా, ఒడిశాలో మొత్తం 21 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో బీజేపీ కేవలం ఒక్క స్థానం గెలవగా, బీజేడీ మిగిలిన 20 స్థానాలను గెలుచుకుంది.

ఇదిలా ఉంటే తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీ, కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు దేశంలోని కీలక నేతలతో భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో కూడా ఆయన భేటీ అయ్యారు. అయితే నవీన్ మాత్రం ఫెడరల్ ఫ్రంట్‌లో చేరే విషయమై క్లారిటీ ఇవ్వలేదు. ఇక తాజాగా బీజేపీ, కాంగ్రెస్‌కి సమ దూరంలో ఉంటామంటూ నవీన్ చేసిన ప్రకటన బట్టి చూస్తే…ఆయన ఫెడరల్ ఫ్రంట్ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.  మరి చూడాలి ఎన్నికల సమయంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో..  

మామాట: మొత్తానికి బాబు గారికి గట్టి షాకే ఇచ్చారు..

Leave a Reply