ఒన్ సెల్ఫీ ప్లీజ్…. ఎన్టీయార్ విత్ జగన్

Share Icons:

హైదరాబాద్, జూన్ 9 :

ఇద్దరూ ఇద్దరే… ఒకరేమో సినిమా స్టార్… మరొకరు పొలిటికల్ స్టార్. ఒకరేమో ఒక పార్టీకి మద్దతిస్తే, మరొకరు సొంత పార్టీ పెట్టుకున్నారు. ఈ రెండు పార్టీలు రాజకీయంగా బద్ధశత్రు పార్టీలు. ఎవరు వీరిద్దరూ…. ఒకరేమో సినిమా హీరో జూనియర్ ఎన్టీయార్, మరొకరు జగన్మోహన్ రెడ్డి… వీరిద్దరూ ఒక చోట ఎదురుపడితే ఎలా ఉంటుదనుకుంటాం. మాట్లాడుకోరు అనుకుంటాం. కానీ, ఈ ఇద్దరు ముచ్చట్లాడుకున్నారు. సెల్పీలు కూడా దిగారట. ఎక్కడ? ఏంటి.?

ఒకరోజు పాటు పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి కోర్టుకు హాజరు కావడానికి వై. ఎస్ జగన్ హైదరాబాద్‌కు వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంకు జగన్ చేరుకున్న సమయంలో అక్కడే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు. ఇక అంతే.. ఇద్దరూ రెండు నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. ఒకరినొకరు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇదంతా బాగానే ఉంది. ఉన్నట్లుండి ‘జూనియర్ ఎన్టీఆర్ మీతో ఒక సెల్ఫీ కావాలం’టూ అడిగారు. జగన్ కు ఒకింత ఆశ్చర్యం.

మీతో లక్షలమంది సెల్ఫీలు తీసుకుని ఉంటారు. కానీ నేనూ మీరూ కలిసి ఒక సెల్ఫీ తీసుకుంటే బాగుంటుందని జూనియర్ ఎన్టీఆర్ ప్రతిపాదించారు. అంతటి హీరో ఆ మాటంటే జగన్ కాదంటాడా… సరేనన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన సెల్ ఫోన్‌తో సెల్ఫీ తీశారు. ఆయన అటు ఈయన ఇటు వెళ్ళిపోయారు.

మామాట : సెల్ఫీల దగ్గరే ఆగుతుందా?

Leave a Reply