టూరిజంపై దృష్టిపెట్టిన జగన్ సర్కార్….బ్రాండ్ అంబాసిడర్లుగా ఎన్టీఆర్‌, పీవీ సింధు?

jr ntr do a movie with kgf director
Share Icons:

అమరావతి:

 

ఏపీలో ఆదాయం ఎక్కువ వచ్చే మరో వనరు ఏదైనా ఉంది అంటే అది టూరిజం. రాష్ట్రంలో చాలా చూడ చక్కని ప్రదేశాలు, దేవాలయాలు చాలానే ఉన్నాయి. అందుకే దీనిపై  జగన్ సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో కూడా అగ్రగామిగా నిలపాలన్న ప్రయత్నాల్లో భాగంగా జనాకర్షణ ఉన్న సెలబ్రిటీలను ఏపీ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలని భావిస్తున్నారు.

 

ఈ క్రమంలో బ్రాండ్ అంబాసిడర్లగా టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్, బ్యాడ్మింటన్ ఆశాకిరణం పీవీ సింధుల పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. జూనియర్ కు మంచి స్నేహితుడు అయిన కొడాలి నాని ఇప్పుడు వైసీపీ సర్కారులో మంత్రి. అంతేకాదు, స్వయానా పిల్లనిచ్చిన మామ నార్నె శ్రీనివాసరావు కూడా వైసీపీ నేత. దాంతో, సహజంగానే ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.

 

ఇక, అంతర్జాతీయ స్థాయిలో ఘనవిజయాలు సాధిస్తూ, దేశంతో పాటు తెలుగు ఖ్యాతిని కూడా ఇనుమడింపచేస్తున్న పీవీ సింధు కూడా ఏపీ సర్కారు దృష్టిలో ఉందని టాక్ వినిపిస్తోంది. బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ వ్యక్తి ఉంటే టూరిజం పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లొచ్చని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

 

అయితే దేశంలోనే రెండో పొడవైన తీరప్రాంతంతో పాటు పురాతన కట్టడాలు, ఆలయాలు, ఇతర పర్యాటక స్ధలాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని సద్వినియోగం చేసుకుంటూ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు వైసీపీ సర్కారు తమ ప్రాధాన్య రంగాల జాబితాలో చేర్చింది. రాష్ట్రవ్యాప్తంగా మ్యూజియాలు, పర్యాటక జోన్ల అభివృద్ధికి సత్వర ప్రణాళికలు రూపొందిస్తోంది. పర్యాటక మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాస్ ఈ దిశగా తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Leave a Reply