రామ్ చరణ్ నిర్మాతగా ఎన్టీఆర్ కొత్త సినిమా?

Ntr new movie with producer ram charan
Share Icons:

హైదరాబాద్, 21 సెప్టెంబర్:

సినిమా ఇండస్ట్రీలో హీరోల సినిమాలకి ఎంత పోటీ ఉన్నా బయట మాత్రం ఆ హీరోలు సన్నిహితంగానే ఉంటారు. కొందరు హీరోలైతే మంచి స్నేహితుల్లా కలిసిపోతారు. అలాంటివారిలో చెర్రీ- తారక్‌లు కూడా ఉన్నారు.

గతంలో వీరివురి స్నేహం గురించి అందరికీ తెలియకపోయినా.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని వీరిద్దరి సాన్నిహిత్యం గురించి అందరికీ తెలుస్తుంది. ఇద్దరూ ఒకరి ఫ్యామిలీ ఫంక్షన్లకి ఒకరు వెళ్ళడం, సరదాగా గడపడం చూస్తూ ఉంటే అభిమానులు సంతోషంలో మునిగితేలుతున్నారు.

త్వరలోనే ఎన్టీఆర్- రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి ఓ భారీ మల్టీ స్టారర్ తెరకెక్కిస్తున్న నేపథ్యంలో అభిమానుల ఆనందం మాటల్లో చెప్పలేనిది.

ఇక తాజాగా ఫిల్మ్ నగర్ నుండి వినిపిస్తిన్న ఈ వార్త వింటే అభిమానులు ఉబ్బితబ్బిబ్బవ్వడం ఖాయం. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే చరణ్ ‘కొణిదల ప్రొడక్షన్స్’లో ఎన్టీఆర్‌తో కలిసి ఓ చిత్రం చెయ్యాలనుకుంటున్నాడట.

ఇప్పటి వరకూ ఖైదీ నెం150, సైరా చిత్రాలతో తన తండ్రి చిత్రాలనే నిర్మించిన చరణ్ ఇకపై ఇతర హీరోల చిత్రాలు కూడా తన బ్యానర్‌లో నిర్మించాలని యోచిస్తున్నాడట.

అందుకోసం ముందుగా ఎన్టీఆర్‌తోనే సినిమా చేయాలని అనుకున్నాడట. ఇందులో భాగంగానే తారక్‌ని కలిసి విషయం చెప్పిన చెర్రీకి తారక్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.

మామాట: ఫ్రెండ్ అడిగితే తారక్ కాదనగలడా…

Leave a Reply