‘ఎన్టీఆర్’ ఎంత కలెక్ట్ చేస్తాడో…?

Share Icons:

హైదరాబాద్, 29 డిసెంబర్:

దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా…నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో.. దర్శకుడు క్రిష్ ‘ఎన్టీఆర్’ బయోపిక్‌ని రెండు భాగాలుగా రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. జనవరి 9న ఎన్టీఆర్ కథానాయకుడు విడుదల అవుతుండగా…ఫిబ్రవరి 7న మహానాయకుడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

అయితే సుమారు 100 కోట్ల వరకు ఈ చిత్ర నిర్మాణానికి ఖర్చు పెట్టినట్లు సమాచారం…అలాగే ఓ గొప్ప వ్యక్తి జీవిత చరిత్ర అందరికీ తెలియాలని ఈ సినిమా తీస్తున్నట్లు, దీని ద్వారా ఎటువంటి లాభాలు ఆర్జించడం లేదని నందమూరి బాలకృష్ణ చెబుతున్నప్పటికీ ఈ సినిమాకి వచ్చే కలెక్షన్లపై ఎక్కువ దృష్టి పెట్టారని తెలుస్తోంది.

కాగా, బాలకృష్ణతో నటించిన ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమా యాభై కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇదే బాలయ్య కెరీర్‌లో ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమా…దీంతో ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందనే విషయంపై ఆసక్తి పెరిగిపోయింది. ట్రేడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ రూ.70 కోట్లు కలెక్ట్ చేస్తుందని, అలానే ఎన్టీఆర్ ‘మహానాయకుడు’ సినిమా రూ.50 నుండి 70 కోట్ల వరకు రాబట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా తమిళం, హిందీ భాషల్లో కనీసం పది నుండి ఇరవై కోట్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయి.

ఓవర్సీస్ కూడా కలుపుకుంటే మొత్తం సినిమా కలెక్షన్స్ బాక్సాఫీస్ వద్ద రూ.160 కోట్లు దాటిపోవడం ఖాయమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. డిజిటల్, శాటిలైట్, ఆడియో రైట్స్ మొత్తం కలుపుకుంటే మరో నలభై నుండి యాభై కోట్లు రావొచ్చు.

అయితే సంక్రాంతికి ఎక్కువ పోటీ ఉండటంతో కథానాయకుడు ఏ రేంజ్ వసూళ్లు రాబడుతుందో చూడాలి…

మామాట: మరి ఎన్టీఆర్‌కి ఎంత లాభం వస్తుందో చూడాలి…

Leave a Reply