ఈ నెల 22న వస్తున్న మహానాయకుడు….

Share Icons:

హైదరాబాద్, 12 ఫిబ్రవరి:

ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘కథానాయకుడు’ చిత్రం జనవరి 9న విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకి మంచి టాక్ వచ్చిన ఆశించిన స్థాయిలో కలెక్షన్లు మాత్రం రాలేదు. ఈ సినిమాతో సుమారు 50 కోట్ల వరకు డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు.

ఈ తరుణంలో రెండవ భాగంగా తెరకెక్కుతున్న  ‘మహానాయకుడు’  చిత్రంలో పలు మార్పులు చేశారు. అయితే ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీనే విడుదల కావాలి…కానీ చిత్రా బృందం మళ్ళీ కొంత షూటింగ్ జరపదంతో ఆలస్యం అయింది. ఇక షూటింగ్‌ని పూర్తి చేసుకున్న మహానాయకుడుని ఫిబ్రవరి 22వ తేదీన విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు చిత్రబృందం ప్రకటన కూడా చేసింది.  

ఇక ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం ప్రధానంగా ‘మహానాయకుడు’ కొనసాగనుంది. ‘కథానాయకుడు’ సినిమా విడుదల సమయంలో .. వయసు మళ్లిన ఎన్టీఆర్ పాత్రకి బాలకృష్ణ బాగా సెట్ అయ్యారని చెప్పుకున్నారు. దీంతో ‘మహానాయకుడు’ సినిమాలో ఆయన దాదాపు అదే లుక్ తో కనిపించనున్నారు.

మామాట: మహానాయకుడు అయిన హిట్ అవుతుందా

Leave a Reply