మహానాయకుడు రిలీజ్ డేట్ మళ్ళీ మారుతుందా..

Share Icons:

హైదరాబాద్, 30 జనవరి:

ఎన్టీఆర్ బయోపిక్‌లోని మొదటిభాగం కథానాయకుడు సంక్రాంతి కానుకగా విడుదలై దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. పాజిటివ్ టాక్ వచ్చిన సినిమా కాస్త ఫ్లాప్ కావడంతో చిత్రయూనిట్ షాక్ అయింది.  అయితే ఆ సినిమా విషయంలో చేసిన తప్పులు రెండో భాగం మహానాయకుడు విషయంలో జరగకూడదని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొదటి భాగంలో ఎమోషన్ మిస్ అయిందని రెండో భాగంలో అటువంటి సన్నివేశాలు ఉండేలా చూసుకుంటున్నారు.

అయితే ముందుగా ఈ సినిమా ఫిబ్రవరి 8న విడుదల అవుతుందని అనౌన్స్ చేసినప్పటికీ ఆ తరువాత షూటింగ్ పూర్తి కాలేదని ఫిబ్రవరి 14కి మార్చారు.  కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ ఫిబ్రవరి 22కి వెళ్లిందని సమాచారం. ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ కథకు కొన్ని సన్నివేశాలు జోడించే పనిలో పడ్డాడు.

మామాట: మరి ఎప్పుడు విడుదల అవుతుందో

Leave a Reply