మహానాయకుడు రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది…

Share Icons:

హైదరాబాద్, 19 డిసెంబర్:

ఎన్టీఆర్ బయోపిక్‌ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అందులో మొదటి భాగమైన ‘కథానాయకుడు’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన విడుదల చేయనున్నారు. అలాగే రెండవ భాగమైన ‘మహానాయకుడు’ను జనవరి 24వ తేదీన విడుదల చేయాలని మొదట భావించారు. కానీ ఈ రెండు భాగాల మధ్య గ్యాప్ కాస్త ఎక్కువగా ఉండాలనే బయ్యర్ల కోరిక మేరకు ఫిబ్రవరి 3వ వారంలో విడుదల చేయాలని భావించారు.

అయితే ఏపీలో రానున్న ఎన్నికలు,  నిబంధనలు దృష్టిలో పెట్టుకుని ఫిబ్రవరి 7వ తేదీన విడుదల చేయడమే మంచిదనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు ఫిక్స్ అయ్యారంటా..ఇక ఈ చిత్ర ట్రైలర్, ఆడియోని ఈ నెల 21న విడుదల చేస్తున్నారు.

మామాట: మొత్తానికి డేట్ ఫిక్స్ అయ్యారు.. 

Leave a Reply