శివరాత్రికి మహానాయకుడు?

Share Icons:

హైదరాబాద్, ఫిబ్రవరి 7:

ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం విడుదల తేదీ ఫిక్స్ అయ్యింది. ఎన్టీఆర్ కథానాయకుడు పేరిట తొలి భాగాన్ని సంక్రాంతి పండుగకు విడుదల చేసిన చిత్ర యూనిట్.. ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ పేరిట రెండో భాగాన్ని మహాశివరాత్రి కానుకగా విడుదల చేయనున్నారని తెలుస్తోంది. నందమూరి తారక రామారావు పాత్రలో ఆయన కుమారుడు బాలకృష్ణ నటిస్తోన్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 9న భారీ అంచనాల మధ్య విడుదలైన ‘కథానాయకుడు’ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. కలెక్షన్లు మాత్రం రాలేదు.

ఈ మూవీ బయ్యర్లకు రూ.50 కోట్ల నష్టాలను మిగిల్చింది. రెండో భాగాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా జవనరి 26న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. తర్వాత ఫిబ్రవరి 7న విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ ‘కథానాయకుడు’ ఎఫెక్ట్, ఇతర కారణాలతో విడుదల ఆలస్యమైంది. తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి 28 లేదా మార్చి 1న ‘మహానాయకుడు’ మన ముందుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

మహానాయకుడు రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో నెటిజన్ల దృష్టి వర్మ తెరకెక్కిస్తోన్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వైపు మళ్లింది. చంద్రబాబు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘మహానాయకుడు’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. మీ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించండంటూ నెటిజన్లు రాంగోపాల్ వర్మను కోరుతున్నారు.

మామాట: మళ్ళీ వాయిదా పడకుండా ఉంటుందా

Leave a Reply