భారీగా ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ ప్రీ-రీలీజ్ ఫంక్షన్…

Share Icons:

హైదరాబాద్, 20 నవంబర్:

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో, క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్’ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ బయోపిక్‌ని ఎన్టీఆర్ ‘కథానాయకుడు’, ఎన్టీఆర్ ‘మహానాయకుడు’ పేర్లతో ప్రేక్షకుల ముందు తీసుకురానున్నారు. జనవరి 9న మొదటి భాగాన్ని, జనవర్ 24న గాని ఫిబ్రవరి 14న గాని  రెండో పార్ట్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా ఇప్పుడు కథానాయకుడు కోసం గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ని ప్లాన్ చేస్తోంది చిత్రబృందం. డిసంబర్ 16న తిరుపతిలో కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు బాలకృష్ణతో పాటు సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తోన్న విద్యాబాలన్, రానా, సుమంత్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి తారలు హాజరుకానున్నారు.

అలాగే ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్నారు. ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ సినిమాలో ఎన్టీఆర్ బాల్యం నుండి  ఆయన  కథానాయకుడిగా ఎదిగిన క్రమాన్ని చూపించనున్నారు.

మామాట: ఇంత భారీ ఖర్చుతో తీస్తున్నప్పుడు ఫంక్షన్ కూడా భారీగానే ఉండాల్లే…  

Leave a Reply