భారీ నష్టాలు తెచ్చిపెట్టిన కథానాయకుడు…

Share Icons:

హైదరాబాద్, 22 జనవరి:

బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా  వచ్చిన చిత్రం ఎన్టీఆర్..‘క‌థానాయ‌కుడు’. జనవరి 9న విడుదలైన ఈ చిత్రానికి రివ్యూలు,  టాక్ పాజిటివ్‌గా ఉన్న కలెక్షన్స్ పరంగా  మాత్రం పూర్తి రివర్స్‌లో ఉన్నాయి.  విడుద‌లైన రోజు నుంచీ  కలెక్షన్స్ డ్రాప్ అవుతూ వస్తూ ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్స్‌కి  భారీ నష్టాలని తెచ్చిపెట్టింది.

ఈ సినిమా మొత్తం 70 కోట్లు బిజినెస్ చేస్తే ప్రస్తుతానికి 20 కోట్లు రాబట్టింది. ఇక సినిమా క్లోజ్ అయ్యేసరికి ఇంకో 2,3 కోట్లు రాబట్టగలదు. మొత్తం మీద చూసుకుంటే 50 కోట్ల వరకు నష్టం వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ ఎన్టీఆర్ రెండో పార్ట్ మహానాయకుడు చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్స్‌కి పైసా తీసుకోకుండా నష్టపరిహారంగా ఇచ్చినట్లు సమాచారం. వాళ్లు లాభాలు సంపాదించుకునేదాకా తనకు డబ్బు వెనక్కి ఇవ్వక్కర్లేదని చెప్పినట్లు సమాచారం. ఇక బాలయ్య తీసుకున్న ఈ నిర్ణయంతో  డిస్ట్రిబ్యూటర్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారట. సెకండ్ పార్ట్ పూర్తి రాజకీయ జీవితం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందని భావిస్తున్నారట. మరి చూడాలి మహానాయకుడు అయిన హిట్ అవుతుందో లేదో…

మామాట: నష్టపోయిన నిర్మాతలు మంచి నిర్ణయం తీసుకున్నారు….

Leave a Reply