ఈ విషయంలో అభిమానులు ఎన్టీఆర్‌ను అర్ధం చేసుకుంటారా..??

ntr fans need to understand his situation
Share Icons:

హైదరాబాద్, 8 అక్టోబర్:

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం దసరా కానుకగా అక్టోబర్11న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ చిత్రానికి ఎస్‌ఎస్ థమన్ అందించిన సంగీత బాణీలు అన్నీ సిట్యుయేషన్‌కి తగినటువంటే పాటలే కావడంతో ఆ పాటలకి ఎన్టీఆర్ దగ్గర నుండి భారీ స్టెప్స్ ఊహించలేం. ఒక్క “రెడ్డి ఇక్కడ సూడు…” పాట మినహా అన్నీ స్లో మోషన్ పాటలే కావడంతో ఈ ఒక్క పాట చాలు ఎన్టీఆర్ డాన్స్ చూడడానికి అని అభిమానులంతా ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.

పైగా ఈ పాటకు జానీ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేస్తుండడంతో ఎన్టీఆర్ ఈ పాటకు డాన్స్ ఇరగదీస్తాడని ఊహించుకుంటున్నారు. అభిమానులు అలా అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే జానీ మాస్టర్ గతంలో తారక్‌తో కలిసి చేసిన టెంపర్ టైటిల్ సాంగ్, నాన్నకు ప్రేమతోలో లవ్ దెబ్బ పాటలు అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుడిని సైతం ఎంతగా అలరించాయో మనం చూశాం.

ఇక రెండు సినిమాల బ్రేక్ తర్వాత ఇద్దరూ కలిసి చేస్తున్న పాట కావడంతో అభిమానుల అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.  కానీ, ఇక్కడ అభిమానులంతా తెలుసుకోవలసిన, అర్ధం చేసుకోవలసిన విషయం ఒకటి ఉంది.

అదేంటంటే ఇటీవల ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ ఆకస్మికంగా మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. తండ్రి చనిపోయిన బాధలో ఉండి కూడా ఎన్టీఆర్ 5వ రోజే అరవింద సమేత షూటింగ్‌కు వెళ్ళాడు. అప్పుడు షూట్ చెయ్యాల్సిన పాట ‘రెడ్డి ఇక్కడ సూడు’. వరుసగా 4రోజులు నిద్ర లేకుండా గడిపిన ఎన్టీఆర్ వెంటనే షూట్‌కి వెళ్ళడం, పైగా 104 డిగ్రీల జ్వరంతో బాధపడుతూ ఉండడంతో ముందుగా పాటను మంచిగా చిత్రీకరించాలని అనుకున్న సినిమా యూనిట్ ఎన్టీఆర్‌ పరిస్థితిని చూసి పాట చిత్రీకరణ మార్చారు. ఆయన ఇదే 104 డిగ్రీల జ్వరంతో టెంపర్ టైటిల్ సాంగ్ చేశాడు. కానీ, ఇప్పుడు తారక్ ఉన్న పరిస్థితి వేరు కదా.. ఇది అభిమానులు అర్ధం చేసుకోవాల్సిన సమయం. 

ఈ విషయాన్నే నిన్న జరిగిన ఆడియో వేడుకలో తారక్‌కు కూడా ప్రస్తావించాడు. “చాలామంది ఈ చిత్రం ఆడియో రిలీజ్ అయినప్పుడు ఎన్టీఆర్ మాస్ హీరో కదా.. డాన్సులు ఉండే పాటలు లేవెంటీ? అని అడిగారు. మీ అందరికీ ఒకటే చెబుతున్నాను. డాన్సర్ కంటే ముందు నేను ఒక నటుడిని.. నటనలో ఒక భాగం డాన్స్ మాత్రమే తప్ప డాన్స్‌లో భాగం నటన కాదు” అంటూ అభిమానులని ఉద్దేశిస్తూ చెప్పాడు తారక్.  

మామాట: మరి అభిమానులు అర్ధం చేసుకుంటారా…

Leave a Reply