ఎన్టీఆర్ బయోపిక్‌: రెండో భాగంలో అతిథి పాత్రల్లో నేటి స్టార్లు…?

ntr biopic update star heros acted in guest roles
Share Icons:

హైదరాబాద్, 15 నవంబర్:

దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడు…ఎన్టీఆర్ మహానాయకుడుగా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక మొదటి భాగంలో ఎన్టీఆర్ బాల్యం, సినిమా జీవితం వంటి విషయాలను చూపించబోతున్నారు.

అయితే రెండో భాగం ఆయన రాజకీయ పార్టీని స్థాపించడం, రాజకీయాల్లో ఎదిగిన తీరు వంటి ఆసక్తికర విషయాలతో ఎన్టీఆర్ ‘మహానాయకుడు’ తెరకెక్కనుంది. అలాగే రెండో భాగంలో నేటి తరం స్టార్ హీరోలను అతిథి పాత్రల్లో చూపించాలనేది చిత్రబృందం ప్లాన్.

దీనికి సంబంధించి ఇప్పటికే కొందరు హీరోలను సంప్రదించినట్లు తెలుస్తోంది. అతిథి పాత్ర పోషణ తాలూకు సందర్భం, సన్నివేశాలు అంతా కూడా సిద్ధమయ్యాయని సమాచారం. హీరోల నుండి గ్రీన్ సిగ్నల్ రావడం ఒక్కటే ఆలస్యం. అంతా అనుకున్నట్లుగా జరిగితే నేటి తరం హీరోలు ఎన్టీఆర్ బయోపిక్ లో కనిపిస్తారు. ఒకవేళ జరగని పక్షంలో నందమూరి ఫ్యామిలీ నుండి మరో నట వారసుడి తెరంగేట్రం చేయించాలని కూడా ఆలోచిస్తున్నారు.

కాగా, ఈ చిత్రం మొదటి భాగం జనవరి 9న విడుదల అవుతుండగా…రెండో భాగం మొదట జనవరి 24న విడుదల చేయాలనుకున్న ఇప్పుడు ఫిబ్రవరికి వెళ్తుందని సమాచారం! 

మామాట: మరి స్టార్ హీరోలు ఎవరెవరు ఉండబోతున్నారో..

Leave a Reply