ఎన్టీఆర్ బయోపిక్: కర్ణుడిగా బాలయ్య..అర్జునుడిగా కల్యాణ్ రామ్…

Share Icons:

హైదరాబాద్, 13 నవంబర్:

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  

ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో మొదటి భాగమైన ‘కథానాయకుడు’కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ జరుపుతూ వస్తున్నారు. అయితే ఎన్టీఆర్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాలలో ‘దాన వీర శూర కర్ణ’ ఒకటి. ఎన్టీఆర్ స్వయంగా దర్శకత్వం వహించి నిర్మించిన ఈ చిత్రం 1977లో సంచలన విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమాలోని ‘చిత్రం భళారే విచిత్రం’ అనే పాట ఆపాతమధురాల్లో ఒకటి. అందువల్లనే ఎన్టీఆర్ బయోపిక్ కోసం ఈ పాటను ఈ రోజున చిత్రీకరించడం మొదలు పెట్టనున్నారు.

కాగా, ‘దాన వీర శూర కర్ణ’లో అర్జునుడుగా హరికృష్ణ నటించారు. అందుకనే ఎన్టీఆర్ బయోపిక్ లో హరికృష్ణ పాత్రను కల్యాణ్ రామ్ పోషిస్తున్నాడు కనుక, ఈ సినిమాలో ఆయన అర్జునుడిగా కనిపించనున్నాడు. త్వరలోనే కర్ణుడిగా బాలకృష్ణ .. అర్జునుడిగా కల్యాణ్ రామ్ కాంబినేషన్లోని ఒక సీన్ ను చిత్రీకరించనున్నారు.

మామాట: మరి బాబాయ్-అబ్బాయ్ కాంబినేషన్‌లో ఈ సీన్ ఎలా ఉండబోతుందో…

Leave a Reply