రెండు భాగాలుగా రానున్న ఎన్టీఆర్…

Share Icons:

హైదరాబాద్, 4 అక్టోబర్:

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా ‘ఎన్టీఆర్’ బయోపిక్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ స్వయంగా వాళ్ల నాన్న ఎన్టీఆర్ పాత్రలో నటిస్తూ, నిర్మిస్తున్నాడు.

అయితే ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. తొలిభాగాన్ని ‘ఎన్టీఆర్ కథానాయకుడు’గా, రెండో భాగాన్ని ‘ఎన్టీఆర్ రాజకీయనాయకుడు’గా కొద్ది రోజుల వ్యవధిలో విడుదల చేస్తారని సమాచారం.

ఈ ఉదయం ఎన్టీఆర్ కథానాయకుడు టైటిల్ పోస్టర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు క్రిష్ తన ట్విట్టర్ అకౌంట్లో వెల్లడించాడు. ‘ప్రతి కథకీ ఓ నాయకుడుంటాడు..కానీ కథగా మారే నాయకుడొక్కేడే ఉంటాడు.’’ అంటూ ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు.

2019 జనవరి 9న ఈ సినిమాను, ఆపై వేసవి నాటికి రెండో భాగం విడుదలవుతుందని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాలో బసవతారకం పాత్రలో విద్యాబాలన్, చంద్రబాబు పాత్రలో రానా, అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో సుమంత్, సావిత్రి పాత్రలో నిత్యామీనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజా షెడ్యూల్ లో భాగంగా కృష్ణా జిల్లా హంసలదీవిలో సినిమా కీలక సన్నివేశాలు తెరకెక్కుతున్నాయి.

మామాట: ఎన్ని భాగాలు అయిన ఉన్నది ఉన్నట్లు తీస్తే బాగుంటుంది…

Leave a Reply