దూసుకెళుతున్న ‘ఎన్టీఆర్’ ట్రైలర్…

Share Icons:

హైదరాబాద్, 22 డిసెంబర్:

నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ఎన్టీఆర్’ బయోపిక్ ట్రైలర్ శుక్రవారం సాయంత్రం విడుదలైంది. హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో జరిగిన ఆడియో వేడుకలో ఎన్టీఆర్ నలుగురు కుమార్తెలు కలిసి ఈ ట్రైలర్‌ని విడుదల చేశారు.

ఎన్టీఆర్ సినిమాల్లోకి వెళ్లడం దగ్గర నుండి రాజకీయాల్లోకి వెళ్లే వరకు అన్ని అంశాలను ప్రస్తావించే విధంగా ట్రైలర్ కట్ చేశారు. ట్రైలర్‌లో బసవతారకం, ఎన్టీఆర్‌ల మధ్య వచ్చిన సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య పలికిన డైలాగులు అభిమానులను కట్టి పడేస్తున్నాయి.

ఇక నిన్న సాయంత్రం రిలీజ్ అయిన ఈ ట్రైలర్ యూ ట్యూబ్‌లో ఇప్పటికే 2 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి 3 మిలియన్స్‌కి చేరువైంది. అలాగే రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన కథానాయకుడు’ చిత్రాన్ని జనవరి 9న విడుదల చేస్తుండగా, ‘మహానాయకుడు’ కథ ఫిబ్రవరి 7న  ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మామాట: మరి సినిమా ఏ స్థాయిలో ఉంటుందో..

Leave a Reply