‘ఎన్టీఆర్’ విడుదల తేదీ చెప్పిన బాలయ్య….

NTR Biopic realese date
Share Icons:

అమరావతి, 4 ఆగష్టు:

నందమూరి బాలకృష్ణ హీరోగా, నిర్మాతగా దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్’ జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్‌ని తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే.

దర్శకుడు క్రిష్, తదితరులతో కలిసి బాలకృష్ణ శనివారంనాడు ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో పర్యటించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ… ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేస్తామని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పాత్రను హీరో దగ్గుబాటి రానా పోషిస్తున్నారని తెలిపారు. తెలుగు జాతిని ప్రపంచ పటంలో ఎన్టీఆర్ ఎలా నిలబెట్టారనేదే చిత్ర ఇతివృత్తమని, నిమ్మకూరులో అక్టోబర్ చివరిలో కానీ.. నవంబర్‌లో కానీ షూటింగ్ ఉంటుంది’’ అని వెల్లడించారు.

ఇది ఇలా ఉండగా నిన్న సీఎం చంద్రబాబును ఎన్టీఆర్ సినిమాలో చంద్రబాబు పాత్రని పోషిస్తున్న రానా కలిశారు. అమరావతి ఎంతో ఆకట్టుకునేలా ఉందని, సినిమా పరిశ్రమ ఏపీలో అభివృద్ధి చెందేందుకు అమరావతి ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా రానా వ్యాఖ్యానించారు.

ఇక తమ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, అత్యంత నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఫిల్మ్ అండ్ టీవీ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోనున్నామని చంద్రబాబు రానాతో చెప్పారు.

మామాట: మరి ‘ఎన్టీఆర్’ కథ ఎలా తెరకెక్కిస్తారో చూడాలి..

Leave a Reply