‘రానా’ చంద్రబాబు నాయుడు….

ntr-biopic: rana in chandrababu getup
Share Icons:

హైదరాబాద్, 12 సెప్టెంబర్:

దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా బాలకృష్ణ ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ ‘ఎన్టీఆర్’ బయోపిక్‌ని రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.

గతంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బాలయ్య లుక్‌ని విడుదల చేసిన చిత్రబృందం…. వినాయకచవితి సందర్భంగా సినిమాలో రానా లుక్‌ని విడుదల చేశారు. రానా.. చంద్రబాబు నాయుడు పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.

Image result for chandrababu old photos

1984లోని చంద్రబాబు గెటప్‌లో రానా లుక్ చాలా సింపుల్ గా కనిపిస్తుంది. మీసం పెట్టి కొత్తగా కనిపించడానికి ప్రయత్నించాడు. ఈ పోస్టర్ బ్యాక్ డ్రాప్‌లో ఎన్టీఆర్ ఫోటో కూడా కనిపిస్తుంది.

ఈ పాత్ర కోసం రానా చాలా హోమ్ వర్క్ చేశాడనే చెప్పాలి. ఒక రకంగా రానా కెరియర్లో ఇది ప్రత్యేకమైన పాత్ర అనే చెప్పుకోవాలి. ఇక ఈ సినిమాలో విద్యాబాలన్ బసవతారం పాత్ర పోషిస్తుండగా.. ఏఎన్నార్ పాత్రలో సుమంత్, ఎస్వీఆర్ పాత్రలో నాగబాబు వంటి నటులు కనిపించబోతున్నారు.

అలానే నరేష్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, కైకాల సత్యనారాయణ వంటి నటుడు మరికొన్ని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.

మామాట: చంద్రబాబు గెటప్‌లో రానా సెట్ అయినట్లే ఉన్నాడు…

Leave a Reply