విదేశాల్లో ‘ఎన్టీఆర్‌’కు అదిరిపోయే డిమాండ్…!

NTR biopic overseas pre release business
Share Icons:

హైదరాబాద్, 14 సెప్టెంబర్:

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో, క్రిష్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘ఎన్టీఆర్’ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.  ఇప్పటికే విడుదలైన ప్రీలుక్, పోస్టర్లతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది.

ఇక ఈ సినిమాకి ఇంతటి భారీ హైప్ రావడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా మొదలైంది. డిస్టిబ్యూటర్స్ ఈ సినిమా హక్కులు దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఓవర్ సీస్ నుంచి ‘ఎన్టీఆర్‌’కు రూ. 20 కోట్ల ఆఫర్ వచ్చినట్టు సమాచారం. గతంలో బాలకృష్ణ నటించిన ఏ సినిమా కూడా విదేశాల్లో ఇంత మొత్తం కలెక్షన్లను సాధించలేదు. ఆయన సినిమాలకు ఇంత భారీ ఆఫర్ రావడం కూడా ఇదే తొలిసారి.

ఇక ఈ సినిమా బాలయ్య సినీ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించే చిత్రంగా నిలుస్తుందని అభిమానులు కూడా అంచనా వేస్తున్నారు. ఈ చిత్రంలో రానా చంద్రబాబు పాత్రలోనూ, విద్యాబాలన్ బసవతారకం పాత్రలోనూ, సుమంత్ ఏఎన్నార్ పాత్రలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే.

మామాట: మరి కలెక్షన్లు ఏ స్థాయిలో వస్తాయో?

Leave a Reply