ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్..బసవతారకం పోస్టర్…

Share Icons:

హైదరాబాద్, 20 డిసెంబర్:

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ‘ఎన్టీఆర్’ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. క్రిష్ దీన్ని రెండు భాగాలుగా రూపొదిస్తున్నారు. ఇక అందులో మొదటి భాగం జనవరి9న, రెండో భాగం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో, ట్రైలర్ రేపు విడుదల కానున్నాయి. అలాగే దివంగత ఎన్టీఆర్ కూతుళ్లతో సినిమా ట్రైలర్ లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. 

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో విద్యాబాలన్ కనిపించనుంది. సినిమాలో ఆమె పాత్ర కీలకంగా ఉంటుందని చెబుతున్నారు. ఆమె పాత్ర ఎన్టీఆర్ గురించి చెప్పడం దగ్గర నుండే కథ మొదలవుతుందని టాక్. ఇప్పటికే సినిమాలో విద్యాబాలన్ లుక్‌ని విడుదల చేసిన చిత్రబృందం. తాజాగా మరో పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో బసవతారకం గెటప్‌లో ఉన్న విద్యాబాలన్ హార్మోనియం వాయిస్తుండగా ఎన్టీఆర్ పాత్ర పోషిస్తోన్న బాలయ్య ఆసక్తిగా చూస్తున్న ఈ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. 

మామాట: సినిమాపై అంచనాలు పెంచుతున్న పోస్టర్..

Leave a Reply