ఒకటే చాలు అంటున్న బాలయ్య…

Share Icons:

హైదరాబాద్, 26 జూన్:

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.

బాలకృష్ణ లీడ్ రోల్‌లో నటించనున్న ఈ సినిమా షూటింగ్ మొదట్లో తేజ దర్శకత్వంలో ప్రారంభమైంది.

కానీ కొన్ని కారణాల వలన తేజ సినిమా నుంచి తప్పుకోవడంతో క్రిష్ దర్శకత్వ బాధ్యతలను చేపట్టాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా విడుదల చేయాలని క్రిష్ భావిస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ జీవిత కథను రెండు పార్టులుగా తెరకెక్కించి ఆరు నెలల వ్యవధిలో రెండింటిని విడుదల చేయాలని క్రిష్ అభిప్రాయం.

కానీ దీనికి బాలయ్య నో చెప్పాడని, సింగిల్ పార్ట్‌లోనే సినిమాని పూర్తి చేయాలని కోరినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా రెండు పార్టులుగా విడుదలవుతుందా? లేదా… అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు  వేచి చూడాల్సిందే. ఈ చిత్రాన్ని 2019 జనవరి 9న విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

మామాట: మరి చివరికి ఎలా విడుదల అవుతుందో?

Leave a Reply