ఎన్టీఆర్ బయోపిక్: హరికృష్ణ పాత్రలో ఎవరంటే?

NTR Biopic: harikrishna character
Share Icons:

హైదరాబాద్, 28 ఆగష్టు:

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో, క్రిష్ దర్శకత్వంలో దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా ‘ఎన్టీఆర్’ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే చిత్రంలోని పలు పాత్రలకి నటీనటులని కూడా ఎంపిక చేశారు. ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తుండగా, చంద్రబాబు పాత్రలో రానా, నాగేశ్వరావు పాత్రలో సుమంత్ కనిపించనున్నారు. ఇంకా పలువురు స్టార్లు నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సమయంలో, ఆయన మరో కుమారుడు హరికృష్ణ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బయోపిక్‌లో నందమూరి హరికృష్ణ పాత్రను ఆయన కుమారుడు నందమూరి కల్యాణ్ రామ్ పోషించనున్నాడట. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ… కల్యాణ్ రామ్ నటించడం ఖరారైందని సమాచారం.

మామాట: మరి చూడాలి ఈ వార్తలో ఎంతవరకు నిజముందో?

Leave a Reply