ఎన్టీఆర్ బయోపిక్: బొబ్బిలిపులిగా బాలయ్య…

Share Icons:

హైదరాబాద్, 10 నవంబర్:

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో, క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్’ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసిన చిత్రబృందం ఎన్టీ రామారావు కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో ఒకటైనా ‘బొబ్బిలి పులి’ లోని కొన్ని సన్నివేశాలని తెరకెక్కించే పనిలో ఉంది.

దాసరి నారాయణరావు దర్శకత్వంలో చాలాకాలం క్రితం వచ్చిన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది. మాస్ ఆడియన్స్ ఈ సినిమాకి నీరాజనాలు పట్టేశారు. అలాంటి ఈ సినిమాలోని సన్నివేశాలను దర్శకుడు క్రిష్ .. ‘ఎన్టీఆర్’ బయోపిక్ కోసం చిత్రీకరిస్తున్నారు.  ఈ సినిమాలోని ఒక భారీ డైలాగ్‌ను అప్పట్లో ఎన్టీఆర్ సింగిల్ టేక్‌లో చెప్పేశారట.

అదే డైలాగ్ ను బాలకృష్ణ కూడా సింగిల్ టేక్‌లో చెప్పేశారట. తాజాగా ఆ సన్నివేశాన్ని చిత్రీకరించగా సెట్లోని వాళ్లంతా క్లాప్స్ కొట్టేశారని అంటున్నారు.

మామాట: మొత్తానికి బొబ్బిలి పులిగా బాలయ్య అదరగొట్టేశాడనమాట….

Leave a Reply