ఎన్టీఆర్‌కి తుఫాన్ దెబ్బ…ఆడియో ఫంక్షన్ వేదిక మారింది…

Share Icons:

హైదరాబాద్, 17 డిసెంబర్:

తీవ్ర పెథాయ్ తుఫాన్ కారణంగా కృష్ణా, గుంటూరు జిల్లాలతో సహ ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ఆడియో వేడుకను ఎన్టీఆర్ జన్మస్థలమైన కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఈ నెల 21న నిర్వహిస్తున్నామంటూ ఇప్పటికే చిత్రబృందం అనౌన్స్ చేసేసింది.

అయితే ఈ వేడుకను వాయిదా వేసినట్టు బాలకృష్ణ మిత్రుడు బొర్రా గాంధీ ఒక ప్రకటనలో తెలిపారు. నిమ్మకూరు వేదికగా ఈనెల 21న నిర్వహించ తలపెట్టిన ఎన్టీఆర్‌ బయోపిక్‌ ఆడియో వేడుక పెథాయ్‌ తుఫాన్‌ కారణంగా రద్దయిందని, ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని గాంధీ వెల్లడించారు.

కాగా, నందమూరి బాలకృష్ణ తన తండ్రి నందమూరి తారక రామారావు జీవితకథను బయోపిక్‌గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఇక ఈ చిత్రంలోని పాత్రల కోసం ప్రముఖ తారాగణాన్ని తీసుకోవడం విశేషం. విద్యాబాలన్, రానా దగ్గుబాటి, నందమూరి కల్యాణ్ రామ్, సుమంత్, రాకుల్ ప్రీత్, నిత్యా మీనన్, తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

మామాట: తుఫాన్ దెబ్బ ‘ఎన్టీఆర్’ కూడా తగిలింది అనమాట..

Leave a Reply