నిమ్మకూరులో ‘ఎన్టీఆర్’ ఆడియో లాంచ్..

Share Icons:

హైదరాబాద్, 12 డిసెంబర్:

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో, క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ‘ఎన్టీఆర్ కథానాయకుడిగా, ఎన్టీఆర్ మహానాయకుడిగా రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు.  

ఇక మొదటి భాగం సంక్రాంతికి విడుదల అవుతున్న నేపథ్యంలో ఆ చిత్ర ట్రైల‌ర్ హైద‌రాబాద్‌లో… ఆడియో రిలీజ్ ఈవెంట్ నంద‌మూరి తార‌క‌రామారావు పుట్టిన ఊరు నిమ్మ‌కూరులో జ‌ర‌గ‌నున్నాయి. డిసెంబ‌ర్ 16న ట్రైల‌ర్ లాంచ్.. 21న ఆడియో వేడుకను గ్రాండ్‌గా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్ర‌ యూనిట్.

ఇక ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన రెండు పాట‌ల‌కు అద్భుత‌మైన రెస్పాన్స్ వస్తున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జ్ఞాన‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. విద్యాబాల‌న్, నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, రానా ద‌గ్గుపాటి, సుమంత్, ర‌కుల్ ప్రీత్ సింగ్, నిత్యా మీనన్ లెజెండ‌రీ కైకాల స‌త్య‌నారాయ‌ణ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

మామాట: ఇక అభిమానులకి పండుగే అనమాట

Leave a Reply