ఓ మంచి విషయం కోసం కలిసి పని చేయనున్న కోహ్లీ, ఎన్టీఆర్

Share Icons:

హైదరాబాద్, 20 జూన్:

విరాట్ కోహ్లీ-ఎన్టీఆర్…ఒకరు క్రికెట్‌లో దిగ్గజ ఆటగాడు…మరొకరు నటనలో నెంబర్ హీరో…వీరిద్దరు కలిసి ఒక మంచి విషయం కోసం కలిసి పని చేయనున్నారు. ఎన్డీటీవీ తయారు చేయనున్న ఓ అవగాహనా కార్యక్రమంలో వీరిద్దరూ కలిసి నటించనున్నారు.

మనదేశంలో మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ఎన్నో ప్రాణాలు పోతున్న సంగతి తెలిసిందే. దీని మీద ఎన్నో అవగాహన కార్యక్రమాలు ఉన్న…ఈ విషయంలో పెద్ద మార్పు రాలేదు. ఈ ప్రమాదాల వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున ప‌డుతున్నాయి.

దీంతో ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న‌ను కల్పించేందుకు ఎన్డీటీవీ కొంతమంది సెలబ్రెటీలతో కలిపి ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భారత జట్టు క్రికెట్ టీమ్ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ లు క‌లిసి వ‌ర్క్ చేయ‌బోతున్నారు.

ఇక వీరిద్దరే కాదు. పలు రంగాల్లోని మరో ఏడుగురు సెల‌బ్రిటీలు కూడా ప్ర‌చారక‌ర్త‌లుగా ప‌నిచేయ‌నున్నారని తెలుస్తోంది. నేడో, రేపు ఈ కార్యక్రమానికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువడుతుందని సమాచారం.

Leave a Reply