వైరల్‌ అవుతూ నోరెళ్లబెట్టిస్తున్న నోరా డాన్స్ వీడియో…

Share Icons:

సినీ అభిమానులకు ముఖ్యంగా డ్యాన్స్‌ లవర్లకు పరిచయం అక్కర్లేని పేరు నోరా. డ్యాన్సర్‌, మోడల్‌, సింగర్‌​, నటి, రియలిటీ షోకు జడ్జిగా… ఇలా అన్ని రంగాల్లో ఇప్పటికే తనదైన ముద్ర వేసుకుంది. ఎలాంటి డ్యాన్స్‌ మూమెంట్స్‌ను అయిన తన స్టైల్లో అవలీలగా చేస్తూ కుర్రకారుకు మతిపోగోడుతుంటుంది. బాలీవుడ్‌లో సత్తా చాటిన ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. టెంపర్‌, కిక్‌2, లోఫర్‌, ఊపిరి చిత్రాల్లో ఆడిపాడిన నోరా- ప్రభాస్‌ నటించిన బాహుబలి సినిమాలో ‘మనోహరి’ పాటలోనూ మెప్పించింది.

నోరా రిలీజ్ చేసిన వీడియోలు సోషల్‌ మీడియాలో క్షణాల్లోనే ట్రెండింగా మారుతాయంటే ఆమెకున్న క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఆ హాట్‌ బ్యూటీ మరో బ్యాన్స్‌ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. వ‌న్ డ్యాన్స్ అనే మ్యుజిషియ‌న్ డ్రేక్ సాంగ్‌కు డ్యాన్స్‌ చేస్తూ స్టెప్పులతో ఇరగదీసింది. పింక్ టాప్, బ్లూ క‌ల‌ర్ డెనిమ్ జీన్స్ ధ‌రించిన నోరా.. త‌న బాడీని మెలిక‌లుగా తిప్పుతూ వయ్యారాల పోయింది. స‌మ్మ‌ర్ టైం అంటూ నోరా చేసిన ఈ డ్యాన్స్ ప్రస్తుతం నెట్టింటా చక్కర్లు కొడుతోంది. అద్భుతంగా ఉందంటూ నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేయగా వైరల్ అవుతున్న విడియో ఇదే!-

సేకరణ :-  మామాట డస్క్ (అంతర్జాల సంచికల నుండి)

Leave a Reply